Samantha : ఖుషి సినిమాలో సమంత పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ .. చివరికి అనకూడని మాట అనేసారు ..!

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2023,10:00 am

Samantha : సమంత లేటెస్ట్ మూవీ ‘ ఖుషి ‘ సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళుతుంది. అయితే మరోవైపు మాత్రం హీరోయిన్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఆమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు నెటిజెన్లు సమంతను ఆటాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఖుషి సినిమాకి రివ్యూ ఇచ్చే సమయంలో ఓ నెటిజన్ సామ్ ని దారుణంగా ఏకిపడేసాడు. నిజంగా సినిమా ఒక పావుగంట చాలా బాగుంది. నేను ఒకటే కోరుకుంటున్న సమంత నీకు పెళ్లి అయింది, పెళ్లికి ముందు ఒకరితో ప్రేమ ఉంది.

ఆ తర్వాత విడాకులు తీసుకున్నావు, ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అయింది. ఎన్ని జరిగినా నువ్వు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయడం మానేసి బాత్రూంలో కెమెరాల ముందు లిప్ కిస్ లు, బెడ్ సీన్లు చేస్తూ ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నావు అని ఘాటుగా ప్రశ్నించాడు. నిన్ను చూసి ఎంతో మంది ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలుసా దయచేసి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండండి. మీ ట్రీట్మెంట్కు డబ్బులు లేకపోవచ్చు కానీ ఇలాంటి రొమాంటిక్ సినిమాలు తీయొద్దు అంటూ వేడుకున్నాడు. సమంతను ఉద్దేశించి ఆ నెటిజన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

trolling on Samantha For Kushi Movie

Samantha : ఖుషి సినిమాలో సమంత పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ .. చివరికి అనకూడని మాట అనేసారు ..!

అయితే ఖుషి సినిమాలో సమంత విజయ్ దేవరకొండ తో కలిసి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. దీంతో సమంత చేసిన పనికి తెగ తిడుతున్నారు. ఇలాంటి రొమాంటిక్ సీన్లు చేయడం అవసరమా అంటూ ఏకిపారేస్తున్నారు. మరి కొందరు మాత్రం సినిమా అన్నాక అన్ని ఉంటాయి కదా ఆమె కూడా ఆ పాత్రకు న్యాయం చేశారు. అంతేకానీ సమంత కావాలని ఎవరిని ఉద్దేశించి ఆ సీన్లు చేయలేదు అంటూ సమంతను వెనకేసుకొస్తున్నారు ఆమె అభిమానులు. ఏది ఏమైనా ఖుషి సినిమాతో సమంత మరోసారి ట్రోలింగ్ కి గురి అవుతుంది. ఆమె విడాకులు తీసుకున్నప్పటినుంచి తప్పు ఆమెవైపే చూపిస్తూ ఇలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి