Manchu vishnu : మంచు ఫ్యామిలీపై ట్రోల్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన మా అధ్యక్షుడు విష్ణు
Manchu vishnu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కుటుంబాలు సినిమా రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అందులో ఒకటి మంచు ఫ్యామిలీ. మంచు మోహన్ బాబు ( mohan babu) తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. నటుడిగా, ప్రతినాయకుడిగా చాలా సినిమాలు చేశాడు.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దగ్గజాలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక దర్శకరత్న దాసరి నారాయణ రావు తన గురువు అని మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
Manchu vishnu : మంచు ఫ్యామిలీపైనే ఎందుకు ట్రోల్స్
సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద కుటుంబాల చేతిలో ఉందని మోహన్ బాబు చాలా కాలం ఆరోపించారు. తన కుమారులకు, యువ నటులకు అవకాశాలు రాకపోవడానికి ఆ కుటుంబాలే కారణం అని కూడా ఆరోపించారు. దీంతో ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన కుటుంబానికి మంచు ఫ్యామిలీకి మధ్య బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.ఇక మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ తరఫున విష్ణు పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలు కూడా నిజమైన రాజకీయాలను తలపించాయి.
ఈ ఎన్నికలను ఇండస్ట్రీలో రెండు కుటుంబాలకు మధ్య జరిగిన ఎన్నికలుగా అభివర్ణించారు. మంచు కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ అండగా నిలిచిందని కూడా టాక్ వచ్చింది.ప్రస్తుతం మా అధ్యక్షుడిగా విష్ణు చార్జ్ తీసుకుని ఏడాది కావొస్తుంది. కానీ ఆయన మా కోసం చేసింది ఏమీ లేదని కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మాఅసోసియేషన్ కోసం శాశ్వత బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి విష్ణు మాట మార్చాడని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తన ఫ్యామిలీపై జరిగే ట్రోలింగ్ పై విష్ణు ఘాటుగా స్పందించాడు.ఇండస్ట్రీలోకి ఎక్కువ మంది బయట వ్యక్తులు రావడం.. మీడియా ప్రాబల్యం పెరగడం వలన కొందరు తమను తాము హైలెట్ చేసుకోవడానికి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు.వీళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా విష్ణు సంభోదించాడు.