Intinti Gruhalakshmi : శృతి, ప్రేమ్ ను తులసి తిరిగి ఇంటికి తీసుకెళ్తుందా? ప్రేమ్ ఆల్బమ్ కోసం అంకిత డబ్బులు ఇస్తుందా?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, జూన్ 13, 2022 ఎపిసోడ్ 657 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కన్నవాళ్లకే నామీద నమ్మకం లేదు. ఇంకెవరు నన్ను నమ్మి షూరిటీ ఇస్తారు అని బాధపడతాడు ప్రేమ్. కొడుకుగా అమ్మకు సాయం చేయడం నా బాధ్యత. అయినా ఏ మొహం పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్తాను. అభి కూడా తన స్వార్థం తనది. నాన్న ముందు చేయి చాపుదామన్నా.. ఆయన నా ఓటమిని చూసి సంతోషిస్తాడు తప్పా పైసా ఇవ్వడు అని బాధపడతాడు ప్రేమ్. ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది. ఏమైంది డబ్బుల విషయం అని అడుగుతుంది. దీంతో షూరిటీ విషయంలో సమస్య వచ్చింది.. అంటాడు. దీంతో వేరే సోర్స్ ఏదైనా ఆలోచిద్దాం అంటుంది శృతి. దీంతో నేను మా బాస్ దగ్గరికి వెళ్తున్నాను. షూరిటీ కోసం కాళ్లో.. గడ్డమో పట్టుకొని అడుగుతాను అంటాడు ప్రేమ్.
దీంతో శృతికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రేమ్ ఇక్కడికి వస్తే తనను ఎక్కడ చూస్తాడో అని వద్దు ఆయన ఎక్కడ డబ్బులు ఇస్తాడు అంటుంది. అయినా కూడా వినకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రావాలి అంటాడు. లిరిక్స్ పేపర్ ఇవ్వాలి అందుకే వెళ్తున్నాను అంటాడు ప్రేమ్. మరోవైపు తులసి స్కూటీని చూసి ఆపుతుంది అంకిత. రోడ్డు మీద ఆపినందుకు క్షమించండి అంటుంది అంకిత. మిమ్మల్ని వదిలేస్తే మా అంత దురదృష్టవంతులు ఉండరు. కన్నతల్లిని కావాలని ఎవ్వరూ దూరం చేసుకోరు. ఇష్టం అయిన వాళ్లను ఎవ్వరూ దూరం పెట్టరు. మనసు చంపుకొని మీరు అలా చేస్తున్నారంటే ఆ నరకాన్ని మించిన భారాన్ని మీరు గుండెల్లో మోస్తున్నారని తెలుసు ఆంటి అంటుంది అంకిత. అత్తింటి గడప తొక్కొద్దు అంటూ మీరు నాకు ఆంక్షలు పెట్టినప్పుడు నేను కూడా అందరిలాగే ఆశ్చర్యపోయాను.. మీ మీద కొప్పడ్డాను. కానీ.. నేను ఎంత పొరపాటుగా ఆలోచించానో తర్వాత తెలుసుకున్నాను ఆంటి. కన్నీళ్లతో మీ కాళ్లు కడుగుదామనిపించింది అంటుంది అంకిత.
Intinti Gruhalakshmi : మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్లిన ప్రేమ్
కట్ చేస్తే ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ముప్పి లహరి ఇంటికి వెళ్తాడు. మీరు చెప్పిన పాట రాసుకొచ్చాను సార్. ఈరోజు ఇవ్వమన్నారు కదా.. తీసుకొచ్చాను అంటాడు ప్రేమ్. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ సంతోషిస్తాడు. కాఫీ తాగి వెళ్లు అంటాడు. దీంతో వద్దు సార్ అంటాడు ప్రేమ్.
అయినప్పటికీ కాఫీ తాగు అంటాడు. ఇంతలో తన కొడుకు వస్తాడు. తర్వాత ప్రేమ్ వెళ్లిపోతాడు. ప్రేమ్ వెళ్లిపోయాక కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది శృతి. ఆ తర్వాత చెత్తకుప్పను తీసుకెళ్లి బయటపారేయ్ అంటాడు ముప్పి లహరి. దీంతో సరే.. అని చెత్తను తీసుకెళ్ల బయట పడేస్తుండగా.. తులసి, అంకిత.. శృతిని చూస్తారు.
దీంతో శృతి షాక్ అవుతుంది. తర్వాత తనను ఓ కెఫెకు తీసుకెళ్లి మాట్లాడుతుంది తులసి. నేనే మొండితనానికి పోయి మూర్ఖంగా ప్రవర్తించాను అంటుంది తులసి. నిజం చెప్పు శృతి నువ్వు చేస్తున్న పని సరైనది అనిపిస్తోందా అని అడుగుతుంది.
దీంతో ఏ పని చేయకపోతే జీవితం ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఆంటి అంటుంది శృతి. కళ్ల ముందు మనకు అవకాశాలు ఉన్నప్పుడు కావాల్సిన అవకాశాన్ని ఎంచుకోవచ్చు. అవకాశమే దొరకనప్పుడు దొరికిన అవకాశంతో రాజీపడక తప్పదు ఆంటి అంటుంది శృతి.
ఒక్కమాట నాతో చెప్పి ఉండాల్సింది కదా అంటుంది తులసి. దీంతో చెప్పడానికి మీరు సమయం ఇస్తే కదా ఆంటి.. ప్రేమ్ తో మీరు మాట్లాడలేదు. చేతగానివాడు అంటూ ముద్ర వేశారు. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు అంటూ మనసు బాధపెట్టే మాటలు అన్నారు. అమ్మకల నెరవేరేలా చేయాలి అన్న ఒకే ఒక్క టార్గెట్ తో ప్రేమ్ పడరాని కష్టాలు పడ్డాడు అంటుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.