Guppedantha Manasu 30 Nov Today Episode : మహీంద్రా విషయంలో జగతిపై రిషి సీరియస్.. మహీంద్రా మీద ఇష్టంతోనే జగతిని ఇంటికి రమ్మన్నాడా?
Guppedantha Manasu 30 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 621 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతిని కారులో తీసుకొని రిషి వెళ్తుంటాడు. జగతి, మహీంద్రా, వసుధార ముగ్గురూ రిషి కారులో వెళ్తుంటారు. నాకు రక్తం ఇచ్చావు.. నన్ను కారులో తీసుకెళ్తున్నావు. చిన్న కుదుపు వచ్చినా సారీ చెబుతున్నావు అంటూ అనుకుంటుంది. ఈ క్షణాన్ని నేను మహీంద్రాతో పంచుకోవాలి అని అనుకుంటుంది. దీంతో మహీంద్రాకు మెసేజ్ చేయాలని అనుకుంటుంది. మహీంద్రాకు మెసేజ్ చేస్తుంది. నా కొడుకు చూడు నాకు రక్తం ఇచ్చాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు అని మెసేజ్ చేస్తుంది. కానీ.. తన ఫోన్ ముందు ఉంటుంది. దీంతో ఆ ఫోన్ ను చూసి ఆ మెసేజ్ చూసి డిలీట్ చేసి ఆ ఫోన్ ను మహీంద్రాకు ఇస్తాడు రిషి. డాడ్ మీ ఫోన్ అని ఇచ్చేస్తాడు. సారీ డాడ్ అని అనుకుంటాడు రిషి. ఆ తర్వాత ఇంటికి వస్తారు అందరూ.
ఎదురుగానే దేవయాని నిలబడి ఉంటుంది. మహీంద్రా, జగతిని చూసి కోపం వస్తుంది తనకు. జగతి కిందికి దిగి నడుస్తూ కిందపడబోతుంది. దీంతో మేడమ్ అంటూ వచ్చి రిషి పట్టుకుంటాడు. దీంతో దేవయాని షాక్ అవుతుంది. జగతికి సంతోషం వేస్తుంది. వసుధార సంతోషిస్తుంది. మహీంద్రాకు సంతోషం వేస్తుంది కానీ.. దేవయాని మాత్రం కోపంగా చూస్తుంది. జగతికి రిషిని చూసి తన చిన్నతనం నాటి ఘటనలు గుర్తొస్తుంటాయి. ఆ తర్వాత మహీంద్రా, రిషి ఇద్దరూ కలిసి తనను పట్టుకొని నడిపిస్తూ ఇంటి లోపలికి తీసుకెళ్తారు. ఎదురుగా దేవయాని నిలబడుతుంది. ఏం చేసినా ఈ జగతి మళ్లీ మళ్లీ ఇంటికి వస్తుంది. ఈ ఇంటికి దూరంగా తరమాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. జగతిని ఏం చేయలేనా అని మనసులో అనుకుంటుంది. రండి మహీంద్రా, రా జగతి అని బయటికి మాత్రం నటిస్తూ మాట్లాడుతుంది.
ఇంతలో రిషి ఆగు అని ధరణి వచ్చి జగతికి హారతి ఇస్తుంది. ధరణి ఇదంతా అంటూ ఏదో అనబోతుండగా పెద్దమ్మ ఏం కాదు. వదిన మీరు కానివ్వండి అంటాడు రిషి. ఎవరి దిష్టికళ్లు పడ్డాయో ఏమో మొత్తానికి గండం గడిచింది అంటుంది ధరణి.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి అంటూ ధరణి దిష్టి తీస్తుంటే జగతి, మహీంద్రాకు నవ్వొస్తుంది. అందరి దిష్టి పోవాలి అని అంటుంది ధరణి. ఇక చాల్లే అంటుంది దేవయాని. కాలం కలిసి వచ్చింది. అందుకే నువ్వు లోపలికి వచ్చావు. మళ్లీ నిన్ను బయటికి ఎలా పంపించాలో నాకు తెలుసులే అని అనుకుంటుంది దేవయాని.
మేడమ్.. మీరు కింద నా రూమ్ వాడుకోండి అని అంటాడు రిషి. నేను డాడ్ పైన ఉంటాం అంటాడు రిషి. వసుధార మేడమ్ ను తీసుకెళ్లు అని చెబుతాడు రిషి. ఆ తర్వాత మహీంద్రాను తీసుకొని రిషి పైకి వెళ్తాడు. మరోవైపు దేవయానికి ఏం చేయాలో అర్థం కాదు.
Guppedantha Manasu 30 Nov Today Episode : దేవయానికి ధరణి మీద డౌట్ వచ్చి నిలదీస్తుందా?
బయటే నిలబడి చూస్తూ ఉంటుంది. దీంతో ధరణి వచ్చి అత్తయ్య గారు వంట ఏం చేయమంటారు అంటుంది. దీంతో ఫోన్ చేసి చెబుతాను. లేకపోతే మెసేజ్ చేస్తాను సరేనా అంటుంది దేవయాని. దీంతో అలాగే అత్తయ్య గారు అంటుంది ధరణి.
ధరణి మీద ఓ కన్నేసిన దేవయాని.. తన దగ్గరికి వెళ్తుంది. ఏంటి ధరణి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో అత్తయ్య గారు అదీ అంటూ ఏదో చెప్పబోతుండగా వంట పని చేస్తున్నాను అని చెప్పకు. అసలు నువ్వు ఏం చేశావో నీకు అర్థం అయిందా.
జగతి రాగానే హారతి ఇచ్చి దిష్టి తీయమని నీకు ఎవరు చెప్పారు. జగతి ఇంట్లోకి వచ్చిందని సంబురపడిపోతున్నావా అంటుంది దేవయాని. అందులో తప్పేముంది అంటుంది ధరణి. దీంతో తప్పా ఒప్పా అని నేను అనడం లేదు. ఇంట్లో ఒకదాన్ని నేను ఉన్నానని నీకు గుర్తుందా?
నీ అంతట నువ్వు చేయడమేనా అంటే.. పెద్దమామయ్యగారే చెప్పారు అత్తయ్య గారు అంటుంది ధరణి. దీంతో ఆయన చెప్పారా అంటుంది దేవయాని. దీంతో అవును అత్తయ్య గారు అంటుంది. మామయ్య గారు చెప్పిన దాన్ని కాదనలేం కదా అత్తయ్య గారు అంటుంది.
ఆయన చెప్పిన విషయం నాకు చెప్పాలి కదా అంటుంది దేవయాని. అదిగోండి మామయ్య గారు వస్తున్నారు. నేను అబద్ధం చెబితే మామయ్య గారిని అడగండి అంటుంది ధరణి. మామయ్య గారు అని పిలుస్తుంది.
దీంతో వద్దు పిలవకు అంటుంది దేవయాని. ఇంతలో ఫణీంద్రా ఇంతలో అక్కడికి వస్తాడు. ఏంటమ్మా పిలిచావు అని అడుగుతాడు. మీకేమైనా కాఫీ ఇవ్వాలా అని ధరణి అడుగుతోంది. అంతే కదా ధరణి అంటుంది. దీంతో నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు.
చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. నీకు కొంచెం దూకుడు ఎక్కువయింది. ఆ జగతిని చూసి ఎక్కువ చేస్తున్నావు. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు వసుధార.. జగతిని జాగ్రత్తగా చూసుకుంటుంది.
తన రూమ్ ను సర్దుతుంది. దీంతో ఇప్పుడు రూమ్ ఎందుకు సర్దుతున్నావు. బాగానే ఉంది కదా అంటుంది జగతి. నీతో ఎక్కువ రోజులు సేవలు చేయించుకోనులే అంటుంది జగతి. దీంతో ఏంటి మేడమ్ మీరు అలా అంటున్నారు అంటుంది వసుధార.
ఇంతలో రిషి వస్తాడు. వసుధార మేడమ్ కు జ్యూస్ తీసుకురా అంటాడు రిషి. దీంతో ఇప్పుడెందుకులే రిషి అంటుంది. కానీ.. వసుధార నువ్వు వెళ్లి తీసుకురా అంటాడు. దీంతో రిషి సార్ మేడమ్ తో ఏదైనా మాట్లాడాలని అనుకుంటున్నాడేమో అని అనుకొని బయటికి వెళ్తుంది వసుధార.
ఇప్పుడెలా ఉంది మేడమ్ అని అడుగుతాడు. దీంతో పర్లేదు రిషి అంటుంది. మందులు అవి జాగ్రత్తగా తీసుకోండి. త్వరగా రికవరీ అవుతారు అంటాడు. మేడమ్ డాడ్, మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లారో.. ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఈ విషయం పక్కన పెడితే జరిగిన యాక్సిడెంట్ లో గాయలతో మీరు బయటపడ్డారు అంటాడు.
అదే ఈ యాక్సిడెంట్ లో డాడ్ కు ఏమైనా జరిగితే అంటాడు రిషి. డాడ్ కు ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి మేడమ్ పరిస్థితి అంటాడు. మీకేమైనా అయితే డాడ్ తట్టుకోగలరా అంటాడు. డాడ్ ఏమైపోయేవారో ఆలోచించండి అంటాడు రిషి.
అదృష్ట వశాత్తు మీరిద్దరూ బయటపడ్డారు. లేకపోతే ఏం జరిగేదో మీరు ఊహించగలరా అంటాడు రిషి. డాడ్ గురించి ఆలోచించారా? ఆయనకు ఏదైనా అయితే మీరు, నేను తట్టుకోగలమా? బంధాలను ప్రేమిస్తే కాదు.. ఆ బంధాలను అపురూపంగా చూసుకోవాలి కదా అంటాడు.
బంధం గురించి గొప్పగా ఒక మెసేజ్ పెట్టడం మాత్రమే గొప్ప ఎప్పుడూ కాదు అంటాడు రిషి. డాడ్ కు మీరేదో మెసేజ్ పెట్టారు. దాన్ని నేను డిలీట్ చేశాను.. అంటాడు. ఒక బంధాన్ని కోరుకుంటే దాని కోసమే బతకాలి.
ఇక చచ్చిపోయినా పర్లేదని మీరు మెసేజ్ లో రాశారు. అలాంటివి చూస్తే డాడ్ బాధపడతారు. అందుకే డిలీట్ చేశాను. డాడ్ కు మీరంటే ఎంత గొప్ప ప్రేమో అది మీకంటే ఎక్కువగా నాకే తెలుసు. అలాంటి మాటలు డాడ్ తట్టుకోలేరు అంటాడు.
ఈ విషయం బహుషా మీకు ఇప్పటిదాకా తెలియదేమో. డాడ్ ఆనందం కోసమే మిమ్మల్ని ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశాను. డాడ్ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నేను ఏం చేసినా డాడ్ కళ్లలో సంతోషాన్ని చూడాలనుకుంటాను అని అంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.