Allu Arjun : బాల‌య్య షోలో పుష్ప‌రాజ్ సంద‌డి.. ర‌చ్చ మాములుగా లేదుగా..వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : బాల‌య్య షోలో పుష్ప‌రాజ్ సంద‌డి.. ర‌చ్చ మాములుగా లేదుగా..వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :10 November 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : బాల‌య్య షోలో పుష్ప‌రాజ్ సంద‌డి.. ర‌చ్చ మాములుగా లేదుగా..!

Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్  unstoppable  సీజన్ 4 విజయవంతంగా దూసుకుపోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య తన హోస్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినీతారల కెరీర్, పర్సనల్ విషయాల గురించి అడియన్స్ కోరుకుంటున్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ కాగా.. ఇప్పుడు సీజన్ 4 సైతం ఆకట్టుకుంటుంది. రీసెంట్‌ఘా సూర్యతో పాటు బాబీ డియోల్, డైరెక్టర్ శివ బాలయ్యతో కలిసి అలరించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బన్నీ Bunny  ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. నాల్గవ ఎపిసోడ్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  Allu Arjun రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.

Allu Arjun ఆ విష‌యంలో కోప‌మెక్కువ‌..

అంతేకాదు ప్రోమో కూడా విడుద‌ల చేశారు.మెగాస్టార్ చిరంజీవి ఫోటోను వేసి చూపించాడు బాలయ్య. చిరుతో ఉన్న బంధం, ప్రేమ, గౌరవం గురించి బన్నీ బాగానే చెప్పినట్టున్నాడు. మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని ఈ వేదికగా మళ్లీ పంచుకున్నాడనిపిస్తోంది. నీకు ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుంది? అని బన్నీని బాలయ్య అడిగాడు. అమ్మాయికి అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు, విన్నప్పుడు అన్నింటి కంటే ఎక్కువగా కోపం వస్తుంది అని బన్నీ ఎమోషనల్ అయ్యాడు.ఈ షోకు బన్నీ తల్లి నిర్మలమ్మ కూడా వచ్చారు. చిన్నతనంలో మీరు బన్నీని కొట్టారా? అని నిర్మలమ్మని బాలయ్య అడిగాడు.

Allu Arjun బాల‌య్య షోలో పుష్ప‌రాజ్ సంద‌డి ర‌చ్చ మాములుగా లేదుగా

Allu Arjun : బాల‌య్య షోలో పుష్ప‌రాజ్ సంద‌డి.. ర‌చ్చ మాములుగా లేదుగా..!

దేనితో కొట్టలేదో అడగండి.. నా మీద అన్నీ ఆయుధాలు వాడారు అని బన్నీ నవ్వేశాడు. అన్నింటికంటే మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఏంటి? ఏం వాడాక మారిపోయావ్ అని బాలయ్య అడిగితే.. స్నేహా రెడ్డి అని తన భార్య చెప్పి నవ్వేస్తాడు బన్నీ. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షో పాల్గొన్నారు బ‌న్నీ. బాలయ్య షో నుంచే పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ప్రారంభించాలని మూవీ టీం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షోలో అల్లు అర్జున్ చేసిన సంద‌డి మాములుగా లేద‌ని చెప్పాలి. ఇక బ‌న్నీ న‌టించిన పుష్ప 2 చిత్రం డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. 5న మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

YouTube video

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది