Upasana Konidela : పిల్లల్ని కనడంపై ఉపాసన క్లారిటీ.. ఏం చెప్పినా కూడా మీడియాలో సెన్సేషన్..!
Upasana Konidela అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా యంగ్ హీరోలంతా ఒకేసారి పెళ్లి పీఠలెక్కేశారు. దాదాపు ఒకే సమయంలో ఈ ముగ్గురి పెళ్లిళ్లు జరిగాయి. అందరూ బాగానే ఉన్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ ఉపాసన ఫ్యామిలీలోనే ఇంకా సంబరాలు రాలేదు. సంతోషాలు విరజిల్లలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లకు నాన్నగా ప్రమోషన్స్ వచ్చాయి.
పిల్లలతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు దాటినా కూడా పిల్లల్ని కనకపోవడంపై నానా రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే అలాంటి ప్రశ్నలు, కామెంట్ల మీద ఉపాసన సీరియస్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య ఓసారి ఇలాంటి వాటిపై కామెంట్ చేసింది. అలాంటివన్నీ మా వ్యక్తిగతం.

Upasana Konidela Serious On Become parents Issue
Upasana Konidela : ఉపాసన సీరియస్..
అది మా పర్సనల్ విషయం అంటూ దాట వేసింది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఓ ప్రశ్నే ఎదురైంది. జూనియర్ రామ్ చరణ్, జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తారు? అని ప్రశ్న ఎదురైంది ఉపాసనకు. దానికి ఉపాసన తన మనసులోని మాటలు, అభిప్రాయాన్ని చెప్పేసింది.పిల్లల్ని కనడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతం.
దానికి గురించి సోషల్ మీడియాలో అందరూ నన్ను ప్రశ్నిస్తుంటారు. కానీ వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఏదైనా సమస్య ఉందని చెప్పినా మీడియాలో సెన్సేషన్ అవుతుంది.. లేదండి త్వరలోనే ప్లాన్ చేస్తామని చెప్పినా కూడా సెన్సేషన్ అవుతుంది. ఇలా నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా అది పెద్ద సెన్సేషన్ చేస్తుంది మీడియా.
నా వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిన పని లేదు. మీరేం అనుకున్నాను నాకేం అభ్యంతరం లేదు.. నేను వాటిని పట్టించుకోను.. సమయం వస్తే ఆ శుభవార్తను సంతోషంగా నేనే చెబుతాను అని ఉపాసన పేర్కొంది.