Krithi Shetty : ఉప్పెన హీరోయిన్ వరుస ఫ్లాప్ లతో దారుణంగా పడిపోయిన పారితోషికం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krithi Shetty : ఉప్పెన హీరోయిన్ వరుస ఫ్లాప్ లతో దారుణంగా పడిపోయిన పారితోషికం

 Authored By prabhas | The Telugu News | Updated on :27 August 2022,8:20 pm

Krithi Shetty : ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా లోనే ఈ అమ్మడి అందం కు మరియు నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఆ సినిమా లో నటిస్తున్న సమయంలో కేవలం పదహారు నుండి పదిహేడు సంవత్సరాలు మాత్రమే కృతి కి ఉన్నాయి. ఆ సమయంలో దాదాపుగా 15 లక్షల పారితోషికం మరియు ఆ పై పది లక్షల వరకు అదనపు పారితోషికంను కృతి శెట్టి అందుకుంది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి మంచి గుర్తింపు రావడంతో ఆ సినిమా విడుదలకు ముందే దాదాపుగా 40 లక్షల పారితోషికం కు ఒక సినిమాకు కమిట్ అయ్యింది.

ఉప్పెన సినిమా విడుదల అయిన తర్వాత అమ్మడి జోరు పెరిగింది. ఏకంగా కోటి రూపాయల వరకు ఈ అమ్మడు డిమాండ్‌ చేయడం మొదలు పెట్టింది. అదే సమయంలో బంగార్రాజు మరియు శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో కోటి అంటే పర్వాలేదు అన్నట్లుగా ఈ అమ్మడిని బుక్ చేయడం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పారితోషికం కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకానొక సమయంలో కోటికి మించి కూడా పారితోషికం తీసుకుంది. కానీ తాజాగా ఈమె మళ్లీ కోటి లోపు పారితోషికం కు పడిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ లను ఈ అమ్మడు మూట కట్టుకుంది.

uppena heroine Krithi Shetty new remuneration for upcoming movies

uppena heroine Krithi Shetty new remuneration for upcoming movies

ముందు ముందు రాబోతున్న సినిమాలు అయినా ఈమెకు సక్సెస్ ను తెచ్చి పెడతాయా అంటే డౌటే అన్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే కొత్తగా ఈమె కమిట్‌ అవుతున్న సినిమాలకు మరీ తక్కువ పారితోషికంను నిర్మాతలు కోట్‌ చేస్తున్నారట. తప్పని పరిస్థితుల్లో ఆమె 75 నుండి 85 లక్షల వరకు పారితోషికం కు ఓకే చెబుతూ సైన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం లేదు. రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే మళ్లీ కోటి ఆపై పారితోషికంతో సైన్ చేయాలని భావిస్తుందట. కొన్ని కథలు నచ్చడంతో తక్కువ పారితోషికం అయినా ఓకే చెబుతుందట.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది