
Urvashi Rautela : ఉత్తరాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది.. దక్షిణాదిలోను నాకు గుడి కట్టాలి : ఊర్వశి
Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా వింత కోరికలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఆలయం ఉందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు దక్షిణాదిలోనూ తన కోసం ఓ గుడి కట్టాలని ఆకాంక్షించారు. దీనితో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మడి చిలిపి కోరికపై నెటిజన్‌లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
Urvashi Rautela : ఉత్తరాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది.. దక్షిణాదిలోను నాకు గుడి కట్టాలి : ఊర్వశి
ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో నవ్వులపాలైన ఈ నటి, ఇప్పుడు నమ్మశక్యం కాని మరో వాదనను తెరపైకి తెచ్చింది. సన్నీ డియోల్, రణదీప్ హుడా నటించిన ‘జాట్’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి, తాజాగా తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఒక గుడి ఉందని, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా తన పేరుతో ఒక గుడిని నిర్మించాలని అని అనడం విమర్శల పాలైంది.
బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే, పక్కనే ఉన్న నా గుడిని చూడండి. అక్కడి వెళ్లి సందర్శించండి. దిల్లీ యూనివర్సిటీలోనూ నా ఫొటోలకు పూలమాలలు వేసి పూజిస్తారు. నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తారు కూడా. ఈ విషయం తెలిసిన తరువాత నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఇది నిజం. దీనిపై చాలా వార్తా కథనాలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరంతా వార్తా కథనాలను చదవచ్చు అని ఊర్వశి పేర్కొంది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నటరత్న బాలకృష్ణలతో కలిసి నటించాను. దక్షిణాదిలో కూడా నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే దక్షిణ భారతదేశంలోనూ నా కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా అని ఊర్వశి అన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.