Home » Entertainment » Uv Creations Confirmed Will Anushka Shetty And Naveen Polishetty Pair Up For Next Film
Entertainment

Anushka shetty : కుర్ర హీరోతో అనుష్క శెట్టి.. మొత్తానికి రూమర్లే నిజమయ్యాయ్!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 26, 2021 6:31 pm
Advertisement

Anushka shetty : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జేజమ్మగా, దేవసేనగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సూపర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం కమర్షియల్ చిత్రాలలో మాత్రమే కాకుండా ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో అనుష్క బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం నిశ్శబ్దం అనే సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క ఏ విధమైనటువంటి సినిమాలను ప్రకటించలేదు. దీంతో ఈమె సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి అనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. అదేవిధంగా ఈమె పలు సినిమా కథలను వింటుందని వార్తలు వచ్చాయి.

Uv creations confirmed will Anushka shetty and naveen polishetty pair up for next film

Advertisement

Anushka shetty : కుర్ర హీరోతో జతకట్టిన అనుష్క శెట్టి:

నేడు జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు కావడంతో యువి క్రియేషన్స్ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క శెట్టి నటిస్తున్నట్లు వెల్లడించారు. మహేష్ బాబు.పీ దర్శకత్వంలో యు.వీ క్రియేషన్స్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 14 తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి