Vadinamma 3 Nov Today Episode : శైలుపై సీత తల్లి ఫైర్.. సుశీలకు గుండెపోటు.. చివరకు ఊహించని ట్విస్ట్..
Vadinamma 3 Nov Today Episode : బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో ఒకటి ‘వదినమ్మ’. ఈ సీరియల్ రోజురోజుకూ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నదని ప్రేక్షకులు అంటున్నారు. గత ఎపిసోడ్‌లో సుశీల రచ్చరచ్చ చేయగా, తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.రఘురామ్-సీతల మ్యారేజ్ డే రోజు అందరు హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న క్రమంలో రఘురాంకు హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో కుటుంబ సభ్యులు రఘురాంను ఆస్పత్రికి తీసుకెళ్తారు. అయితే, రఘురాం వైద్యుల చికిత్స తర్వాత కోలుకుంటాడు. మరో వైపున సీత తల్లి సుశీల రచ్చరచ్చ చేస్తుంది. శైలు దగ్గరకు వెళ్లి బాబును తీసుకుంటుంది. బాబును ఎత్తుకుని ముద్దాడి తన మనవడని మురిసిపోతుంది. ఈ క్రమంలోనే శైలుపై ఫైర్ అవుతుంది సుశీల.
అయితే, అంతలోనే అక్కడకు వచ్చిన లక్ష్మణ్, సిరి, రాజేశ్వరి సుశీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె అస్సలు పట్టించుకోడు. తన అమ్మను ఇక్కడి నుంచి వెనక్కి తీసుకుని వెళ్లకపోతే సంబంధాలు ఉండబోవని సీతను భాస్కర్ హెచ్చరిస్తాడు.అలా జరుగుతున్న సందర్భంలోనే సీత తల్లి సుశీల బాధపడుతూ బాబును శైలుకు ఇస్తుంది. ఇంతలోనే సుశీలకు గుండెపోటు వస్తుంది. అయితే, ఇదంతా నిజం కాదండోయ్..భాస్కర్ ఊహించుకున్నట్లుగా చివరలో ట్విస్ట్ ఇస్తారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలోనే ఉన్న రఘురాం కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్తారు.
Vadinamma 3 Nov Today Episode : రఘురాం డిశ్చార్జ్.. భాస్కర్‌కు అంతా తెలిసిపోయింది..
అయితే, డాక్టర్స్ వైద్యం కంటే కూడా సీతక్క చెప్పిన మాటల వల్లే రఘురం కోలుకున్నారని వైద్యులు తెలుపుతారు. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన రఘురాం రిషిని గుండెలకు హత్తకుంటాడు. అది చూసి శైలు బాధపడుతుంది. లక్ష్మణ్ రిషిని ఇచ్చేస్తానని మాట ఇచ్చాడా అని అనుమానపడుతుంది.ఇకపోతే రఘురాం గుండె నొప్పి వచ్చి కోలుకుని వచ్చిన తర్వాత మళ్లీ గుండెల మీద రిషిని పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని సిరి అంటుంది. అప్పుడు రఘురాం మాట్లాడుతూ తనకు రిషి గుండెకు భారం కాదని, గుండెకు రక్షణగానే ఉంటాడని అంటాడు. అలా మాటలు కొనసాగుతుండగానే ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే, కమింగ్ అప్ ప్రకారం..
తన భార్య, తల్లితో కలిసి రఘురాం ఇంటికి వచ్చిన భాస్కర్ ..మా మేనల్లుడిని మాకు ఇవ్వండి ఒకసారి గుండెలకు హత్తుకుంటామని అంటాడు. ఆ మాటలు విని రఘురాం షాక్ అవుతాడు. అప్పుడు భాస్కర్ మాకు అంతా తెలుసు.. మీరు మాట్లాడుకున్న మాటలు విన్నాం అని అంటాడు. ఇంతలో దుర్గ అనుమానంగా చూస్తుంటాడు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది. సీతకు తెలియకుండానే రఘురాం శైలుకు తన బిడ్డను ఇచ్చాడన్న పాయింట్ మీదనే చాలా రోజుల నుంచి ‘వదినమ్మ’ సీరియల్ రన్ అవుతుందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పాయింట్‌కు రకరకాల ట్విస్టులు యాడ్ చేస్తూ సీరియల్‌ను సాగదీస్తున్నారని, కొత్తదనం అతి త్వరలో ఉండబోతుందనే ఆసక్తి కలిగించి మళ్లీ మొదటకు తీసుకొస్తున్నారని నిరాశ చెందుతున్నారు ప్రేక్షకులు. ఇంతకూ శైలుకూ అసలు నిజం తెలుస్తుందా.
ఒక వేళ తెలిసినా బాబును సీతకు ఇస్తుందా? అనేది తేలకుండానే మరో వైపున ఇంకో విధంగా రఘురాంకు గుండెపోటు రావడం, సీత తల్లి సుశీల శైలుపైన ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి ఘటనలు చకచకా జరిగిపోతున్నాయి. రిషి గురించి అసలు నిజం రఘురాంకు కాని తన తమ్ముళ్లకు కాని తెలుస్తుందా లేదా అనేది ఎప్పటికీ ఎడతెరిపి లేని ఆసక్తికర చర్చగానే ఉంటుండటం గమనార్హం.