Vadinamma 31 Oct Today Episode : ఇదిగో బావా మన బిడ్డ.. అంటూ రఘురామ్ కు అసలు నిజం చెప్పిన సీత.. ఇది విని లక్ష్మణ్, శైలూ ఏం చేస్తారు?
Vadinamma 31 Oct Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రేపు సోమవారం ప్రసారం అవుతుంది. ఈరోజు ప్రసారం కాదు. రేపు సోమవారం, 1 నవంబర్ 2021న 688 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. రఘురామ్ కు ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్ పడుతుంటారు. ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి సీతను ఆసుపత్రికి రమ్మంటాడు. దీంతో సీత, లక్ష్మణ్ ఇద్దరూ ఆఫీసుకు వెళ్తారు. మీ అన్నయ్య బాడీ ట్రీట్ మెంట్ కు సహకరించడం లేదంటూ డాక్టర్ చెబుతాడు. దీంతో సీత, లక్ష్మణ్ షాక్ అవుతారు. ఆయన మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే వెంటనే తీర్చేయండి అని డాక్టర్ చెబుతాడు.

vadinamma 31 october 2021 episode highlights
తర్వాత ఇంటికి వస్తారు సీత, లక్ష్మణ్. పెద్దోడికి ఎలా ఉందని రాజేశ్వరి అడుగుతుంది. బావకు ఏం కాదు అంటుంది కానీ.. రాజేశ్వరి నమ్మదు. చివరకు లక్ష్మణ్ ను అడుగుతుంది. దీంతో అన్నయ్య మనసులో ఏదో కోరిక ఉందట. అది తీరనందున ఆయన బాడీ ట్రీట్ మెంట్ కు సహకరించడం లేదంటూ చెబుతాడు. దీంతో రాజేశ్వరి షాక్ అవుతుంది. ఎలాగైనా నా కొడుకును కాపాడు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయకు. రిషి తన కొడుకే అని చెప్పు. అలాగైనా వాడికి బతకాలనే ఆశ కలుగుతుంది అని చెబుతుంది రాజేశ్వరి.
Vadinamma 31 Oct Today Episode : రఘురామ్ కు అసలు విషయం చెప్పిన సీత
దీంతో సీతకు ఏం చేయాలో అర్థం కాదు. సీత.. శైలూ కోసం త్యాగం చేస్తే.. రాజేశ్వరి మాత్రం నీ త్యాగం గీగం వద్దు.. ముందు రిషి తన కొడుకే అని ఆసుపత్రికి వెళ్లి పెద్దోడికి చెప్పు అంటుంది రాజేశ్వరి. నువ్వు వెళ్లకపోతే నేను వెళ్లి చెబుతా అంటుంది. దీంతో తప్పని పరిస్థితుల్లో సీత.. రిషిని తీసుకొని ఆసుపత్రికి వెళ్తుంది.

vadinamma 31 october 2021 episode highlights
ఆసుపత్రికి తీసుకెళ్లి.. బెడ్ మీద పడుకొని ఉన్న రఘురామ్ తో ఇదిగో మన బిడ్డ. నీ కన్న బిడ్డ అని చెబుతుంది. రిషి చేయిని తన చేతుల్లో పెడుతుంది. కళ్లు తెరువు బావా.. నీ బిడ్డను నీ చేతుల్లో పెట్టడానికి తీసుకొచ్చా అంటుంది. ఇంతలో రఘురామ్ లేచి.. తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతాడు. ఆనందంలో ఉంటాడు. ఇంతలో లక్ష్మణ్, శైలూ ఆసుపత్రికి వస్తారు. సీత చెప్పిన మాటలు విని షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.