Vadinamma 5 Nov Today Episode : రిషిని తీసుకొని గుడికి, షాపునకు వెళ్లిన రఘురామ్.. ఈ విషయం తెలిసి షాకింగ్ నిర్ణయం తీసుకున్న శైలూ
Vadinamma 5 Nov Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 నవంబర్, 2021 శుక్రవారం 692 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రఘురామ్ బతికిపోవడంతో శ్రావ్య నాన్న షాక్ అవుతాడు. ఆ రఘురామ్ ను నేను అంత ఈజీగా వదిలిపెట్టను. చూస్తూ ఉండు అని తన బావమరిదికి చెబుతాడు. మరోవైపు రఘురామ్.. రిషిని తీసుకొని గుడికి వెళ్తాడు. గుడిలో రిషితో పాటు ప్రదిక్షణలు చేసి ప్రత్యేక పూజ చేయిస్తాడు. వీడు మా కుటుంబానికే వారసుడు. వీడి పేరు మీద పూజ చేయండి పంతులు గారు అంటాడు రఘురామ్. సరే.. అని పూజారి పూజ చేస్తాడు.

vadinamma 5 november 2021 full episode
ఇంట్లో రిషి ఎక్కడ ఉన్నాడని చూస్తుంటుంది శైలూ. సిరి కూతురు తెగ ఏడుస్తుంటుంది. దీంతో రిషి ఎక్కడ ఉన్నాడని చూస్తుంది. కానీ.. తనకు కనిపించడు. సీతక్క.. రిషి ఎక్కడ అని అడుగుతుంది. నేను చూడలేదు అమ్మా అంటుంది సీత. వైదేహి పక్కన కూర్చోబెట్టాను కానీ.. రిషి కనిపించడం లేదు.. అంటుంది. ఎక్కడా లేకుండా.. ఎవరి దగ్గర లేకుండా ఏమైపోతాడు శైలూ అని లక్కీ అడుగుతాడు. కానీ.. తనకు తెలియదు అంటుంది శైలూ. అందరూ షాక్ అవుతారు. పిల్లాడు ఏమయ్యాడో అని అందరూ టెన్షన్ పడుతుంటారు.
Vadinamma 5 Nov Today Episode : రిషి కనిపించడం లేదని టెన్షన్ పడ్డ శైలూ
సీతక్క.. బావ ఎక్కడ అని అడుగుతుంది. బావ షాప్ కు వెళ్లాడు అంటుంది సీత. ఒకసారి బావకు ఫోన్ చేయి అని లక్ష్మణ్ కు చెబుతుంది శైలూ. లక్ష్మణ్ ఫోన్ చేస్తాడు. బాబు గురించి అడుగుతాడు. నేనే తీసుకొని వచ్చాను. సుబ్రహ్మణ్యస్వామి పూజ ఉంటే తీసుకొచ్చా. ఇప్పుడే పూజ అయిపోయింది. రిషిని నాతో పాటు షాపునకు తీసుకెళ్తాను. మీరేం టెన్షన్ పడకండి అంటాడు రఘురామ్.
దీంతో శైలూకు తీవ్రంగా కోపం వస్తుంది. ఇలా నాకు చెప్పకుండా బాబును తీసుకెళ్లడం ఏంటి.. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇదివరకు చాలాసార్లు ఇలాగే జరిగింది. బావ గారు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ శైలూ సీరియస్ అవుతుంది. దీంతో సీత సర్దిచెబుతుంది.

vadinamma 5 november 2021 full episode
మరోసారి లక్ష్మణ్ ఫోన్ చేసి సీతకు ఫోన్ ఇస్తాడు. సీత ఫోన్ తీసుకుంటుంది కానీ.. లక్ష్మణే మాట్లాడుతున్నాడనుకొని రఘురామ్ ఎందుకురా ఊరికే ఫోన్ చేస్తున్నారు అంటాడు. బావ నేను సీతను మాట్లాడుతున్నాను అంటుంది. శైలూ నీకో మాట చెప్పమంది అందుకే కాల్ చేశాను అనగానే కాల్ కట్ చేస్తాడు రఘురామ్. దీంతో ఛీ… అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శైలూ.
ఇంతలో తన అన్న భాస్కర్ వస్తాడు. సీతతో మాట్లాడుతాడు. బావకు బాధ వస్తే నీకే చెప్పుకునేవాడు. కానీ.. ఇప్పుడు నువ్వే బావను బాధపెట్టావు. దీంతో ఎవరికి చెప్పాలో తెలియక కుమిలిపోతున్నాడు అంటుంది. దీంతో అన్నయ్య నేనేదో బావకు ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నావు. బావంటే నాకు కూడా చాలా ఇష్టం అని తన అన్నతో అంటుంది సీత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.