Vadinamma 6 Nov Today Episode : రిషి కోసం పిచ్చిపట్టిన దానిలా తిరిగిన శైలూ.. బాబును వదలని రఘురామ్.. సీత ఇంట్లో అగ్గిరాజేసిన పార్వతి, దుర్గ

Authored By Varun G | The Telugu News | Updated on : 6 November 2021, 2:50 pm

Vadinamma 6 Nov Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. వదినమ్మ సీరియల్ 6 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 693 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషిని షాపునకు తీసుకెళ్తాడు రఘురామ్. రిషి.. బాగా ఏడుస్తుంటాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు రఘురామ్ కు. కన్నతండ్రిని అయి ఉండి రిషిని నేను దొంగలా తీసుకురావాల్సి వస్తోంది అంటూ బాధపడతాడు రఘురామ్. ఇంతలో పార్వతి.. ఆ షాపును చూస్తుంది. రిషిని చూస్తుంది. నా మనవరాలేమో అనుకొని భయపడుతుంది. కానీ… సిగ్గు లేకుండా చిన్నపోరగానికి పొట్లం కట్టుడు నేర్పించుడేంది అని అనుకుంటుంది. దుర్గ కూడా తనతోనే ఉంటుంది. ఈ విషయం వెంటనే శైలూకు చెప్పాల్సిందే. వెంటనే నీ ఫోన్ లో వీడియో తీయ్ అని దుర్గకు చెబుతుంది. వీడియో తీసిన తర్వాత ఇంటికి వెళ్దాం పదా అని పార్వతి.. దుర్గను తీసుకొని వెళ్తుంది.

vadinamma serial 6 november 2021 full episode

vadinamma serial 6 november 2021 full episode

కట్ చేస్తే.. బాబు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శైలూ. ఏంటి సీతక్కా ఇది. బావ ఇంకెప్పుడు పిల్లాడిని తీసుకొస్తాడు అంటాడు. బావకు నువ్వు కాల్ చేయ్ సీతక్క. నువ్వే చేసి బాబును తీసుకురా అంటుంది శైలూ. ఇంతలో పార్వతి, దుర్గ ఇద్దరూ ఇంటికి వచ్చి నీ కొడుకుకు రఘురామ్ పొట్లాలు కట్టడం నేర్పిస్తున్నాడు అంటుంది పార్వతి. దీంతో శైలూ షాక్ అవుతుంది. కిరాణ దుకాణాన్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అందుకే.. ముందే రిషికి అన్ని నేర్పిస్తున్నాడు అంటుంది దుర్గ. దీంతో శైలూ తట్టుకోలేదు.

Vadinamma 6 Nov Today Episode : శైలూను రెచ్చగొట్టిన పార్వతి, దుర్గ

రిషికి కిరాణం షాపులో పనిచేయాల్సిన గతి ఏం పట్టలేదు. మా ఆయనలా ఇంజినీర్ అవుతాడు. మంచిగా చదువుకుంటాడు అంటుంది శైలూ. కానీ.. పార్వతి, దుర్గ.. ఇద్దరూ ఇంటికి వచ్చి హడావుడి చేస్తారు. శైలూ మనసు ఎందుకు పాడు చేస్తున్నారు అని అంటుంది సీత. వీళ్లు మన మాట నమ్మరు.. అని వీడియో, ఫోటో తీయమన్నా కదా. ఆ ఫోటో చూపించు అంటుంది. దీంతో ఆ ఫోటోను శైలూకు చూపిస్తుంది దుర్గ.

vadinamma serial 6 november 2021 full episode

vadinamma serial 6 november 2021 full episode

ఉదయం నుంచి గొడవ పడుతూనే ఉన్నాను. రిషిని షాపునకు తీసుకెళ్లొద్దు అని ఎవరైనా పట్టించుకుంటే కదా. చూడండి.. ఇప్పుడు ఏం జరిగిందో.. అని శైలూ బాధపడుతుంది. శైలూ ఇక ఆగదు. వెంటనే కిరాణ షాపునకు ఆవేశంగా వెళ్తుంది శైలూ. ఇప్పుడు నీ కళ్లు సల్లబడ్డాయా? అని అంటుంది సిరి.

కట్ చేస్తే.. శైలూ షాపునకు వస్తుంది. ఏరి.. ఎక్కడికి వెళ్లారు అంటుంది. షాపులో లేరు వదిన.. అంటాడు భరత్. షాపులో వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది శైలూ. కస్టమర్లను కూడా వెళ్లగొడుతుంది శైలూ. రిషికి బావగారు పొట్లాలు కట్టడం నేర్పిస్తున్నారట కదా.. అంటుంది. మీకు సరదాగా ఉందా? నాకు ఒళ్లు మండిపోతుంది అంటుంది శైలూ. పొట్లాలు కట్టడం నేర్పించడం ఏంటి.. అని సీరియస్ అవుతుంది శైలూ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp