Intinti Gruhalakshmi 6 Nov Today Episode : శృతిని టార్గెట్ చేసిన అంకిత.. నందు తులసి మాట వినడం చూసి తట్టుకోలేకపోయిన లాస్య షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 6 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి నాతో ఆటలు ఆడుతున్నావా? అని అంకిత.. శృతితో అంటుంది. నేను కూడా అదే చేస్తున్నాను.. పూజ నేను చేస్తాను అంటుంది శృతి. ఓహో.. వాయిస్ లేస్తోంది.. అంటుంది. రెచ్చగొడుతున్నావా? అంటే లేదు అంకిత అడ్డుతప్పుకో అంటుంది శృతి. నువ్వు, నీ భర్తను ఆంటి ముందు అవమానించినా నీకు బుద్ధి రావడం లేదా? అంటూ శృతిని అంటుంది అంకిత. నేను నీకు ఏం అన్యాయం చేశాను అని ఇలా చేస్తున్నావు అంకిత అంటుంది. నువ్వు నా ఈగోను హర్ట్ చేశావు అందుకే నీ మీద పగ తీర్చుకుంటున్నాను అంటుంది.

intinti gruhalakshmi 6 november 2021 full episode
ఈ క్షణం నుంచి నువ్వు నా ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. ఇప్పటి నుంచి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. నేను చెప్పిందే చేయాలి. కాదు కూడదు అంటూ పెత్తనాలు మొదలు పెడితే అస్సలు బాగుండదు అంటుంది. ఇది కరెక్ట్ కాదు అంకిత అంటే.. ఏం చేయాలి మరి చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నావు అంటుంది. దీంతో శృతికి ఏం చేయాలో అర్థం కాదు.
కట్ చేస్తే.. తులసి, నందు, లాస్య.. ఆఫీసుకు బయలుదేరుతారు. ఇంతలో అంకిత వచ్చి అమ్మ వారి హారతి తీసుకోండి అని అంటుంది అంకిత. దీంతో హారతి తీసుకుంటుంది తులసి. అంకుల్ మీరు కూడా హారతి తీసుకోండి అంటుంది అంకిత. సరే.. అని హారతి తీసుకుంటాడు నందు. దీంతో అంకిత చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి నందు ఎప్పుడూ లేనిది ఇంత భక్తిగా హారతి తీసుకుంటున్నావు ఆశ్చర్యంగా ఉంది అంటుంది లాస్య. ఇందులో ఆశ్చర్యం ఏముంది. ఎలాంటి వారితో తిరిగితే అలాంటి అలవాట్లే వస్తాయి అంటారు అంటాడు పరందామయ్య. మొన్నటి వరకు నీతో తిరిగాడు. ఇప్పుడు తులసితో తిరుగుతున్నాడు. అందుకే మంచి అలవాట్లు అబ్బుతున్నాయి అంటాడు పరందామయ్య.
Intinti Gruhalakshmi 6 Nov Today Episode : శృతిపై నందు సీరియస్
ఆంటి మీరు కూడా తీసుకోండి హారతి అని అంటుంది అంకిత లాస్యను. దీంతో నేను ఒకరిలా అలవాట్లను మార్చుకోను.. అంటుంది లాస్య. ఇంతలో శృతి వచ్చి తులసికి లంచ్ బాక్స్ ఇస్తుంది. ఇంతలో నందుకు నిన్న పిజ్జా తిన్న విషయం గుర్తు వస్తుంది. వెంటనే రాములమ్మ నాకు కూడా లంచ్ బాక్స్ తీసుకురా అంటాడు నందు. కానీ.. శృతి తీసుకొచ్చి ఇవ్వడంతో నందుకు కోపం వస్తుంది. నేను అడిగానా.. నిన్ను అడిగానా అంటాడు నందు. రాములమ్మను అడిగారు అనేసరికి.. నువ్వెందుకు తీసుకొచ్చావు అంటాడు నందు. ఇంతలో అంకిత కల్పించుకొని మీదగ్గర కూడా ఉత్తమ కోడలు అనిపించుకోవాలనే తాపత్రయం అంకుల్ అంటుంది అంకిత.

intinti gruhalakshmi 6 november 2021 full episode
అంకుల్ అన్న మాటలకు బాధపడకు శృతి అంటుంది తులసి. నాకేం బాధ లేదు ఆంటి. నా చేత్తో తీసుకోకపోయినా నేను వండిన వంటే తింటాడు కదా అని అంటుంది శృతి. నువ్వు కూడా నా లాగే అల్ప సంతోషివమ్మా. ఓర్పుగా ఉండేవాళ్లు ఎప్పుడూ ఓడిపోరు అని చెప్పి తులసి ఆఫీసుకు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.