Janaki Kalaganaledu 6 Nov Today Episode : జానకి విషయంలో మైరావతి ఏ నిర్ణయం తీసుకుంటుంది? జానకిని ఇంట్లో నుంచి పంపించేస్తుందా?
Janaki Kalaganaledu 6 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 8 నవంబర్ 2021, 166 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సోమవారం ఎపిసోడ్ లో మైరావతి లైన్ లోకి వస్తుంది. మైరావతి ఎవరో కాదు.. జ్ఞానాంబ అత్తయ్య. గోవిందరాజు అమ్మ. జానకి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవడంతో మైరావతి సాయం తీసుకోవాలని గోవిందరాజు జ్ఞానాంబకు చెబుతాడు. దీంతో జ్ఞానాంబ కూడా సరే అని తన అత్తయ్యకు ఫోన్ చేస్తుంది. అసలు విషయం చెబుతుంది. దీంతో దీపావళి రోజున నోములు ఉన్నాయి కదా.. అందరూ రండి.. అక్కడే చూద్దాం.. అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

janaki kalaganaledu 6 november 2021 full episode
ఈ విషయం విన్న మల్లిక.. వెంటనే జానకి దగ్గరికి వెళ్లి అసలు విషయం చెబుతుంది. నా టెన్షన్ నీ గురించే జానకి. నువ్వు బ్యాగు సర్దుకొని మీ వాళ్ల దగ్గరికి వెళ్లిపో జానకి అంటుంది. ఏమైంది మల్లిక ఎందుకు అలా అంటున్నావు అంటే. గొయ్యిలో నుంచి నుయ్యిలో పడబోతున్నావు నువ్వు. దీపావళి పండక్కి రేపు మనం అత్తయ్య గారి వాళ్ల అత్తయ్య గారి ఊరికి వెళ్తున్నాం అని చెబుతుంది. అక్కడికి వెళ్తే సంబంధం ఏంటి అని అంటుంది. దీంతో మైరావతి గురించి చెబుతుంది. మైరావతి ఎంత డేంజరో చెబుతుంది.
జ్ఞానాంబ పోలేరమ్మ అయితే.. ఆవిడ మహంకాళమ్మ అంటుంది. చండశాసనురాలు అంటుంది. తను ఎలాంటిదో అక్కడ ఉన్న పనోళ్లను చూస్తేనే అర్థం అవుతుంది. అయితే.. మైరావతి వల్ల జానకికి ఇంకా కష్టాలు ఎక్కువ కానున్నాయి. తనకు ఎవరు ఎదురు చెప్పినా ఇక వాళ్ల పని అంతే. ఆవిడ మాటే శాసనం. ఆవిడ చెప్పిందే వేదం.. ఎవరైనా సరే.. ఆవిడ చెప్పినట్టు చేయాల్సిందే. ఎవరైనా అబద్ధం చెప్పినట్టు తెలిస్తే అస్సలు తట్టుకోలేదు.. అని చెబుతుంది మల్లిక. శిక్ష వేయకుండా అస్సలు వదిలిపెట్టదు అంటుంది.
Janaki Kalaganaledu 6 Nov Today Episode : జానకిని భయపెట్టిన మల్లిక
నువ్వు కూడా అబద్ధం చెప్పావు కాబట్టి నిన్ను ఏం చేస్తుందో అని భయం వేస్తుంది అంటుంది మల్లిక. నువ్వు దేవత లాంటి అత్తయ్య గారిని మోసం చేశావని చెప్పినా ఇక మహంకాళమ్మ ఏం చేస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది.. అంటుంది మల్లిక.

janaki kalaganaledu 6 november 2021 full episode
కట్ చేస్తే.. దీపావళి రోజున అందరూ మైరావతి ఇంటికి వెళ్తారు. మైరావతి ఇంటికి వెళ్లాక అక్కడ ఆశీర్వాదం తీసుకోబోతారు రామా, జానకి. వెంటనే మైరావతి జానకిపై సీరియస్ అవుతుంది. నీకు దండం పెట్టడం తెలుసా? అంటుంది. తల వంచి దండం పెట్టడం తెలియదు.. పెద్దోళ్ల కాళ్లకు దండం పెట్టేటప్పుడు తల, నుదురు పాదాలకు తాకాలి అంటుంది. ఎందుకో తెలుసునా.. నాలో అహంకారం కానీ.. పొగరు కానీ లేదు అని చెప్పడం కోసం. ఈ విషయం నిజంగా నాకు తెలియదు అంటుంది జానకి. అప్పుడు కిందికి వంగి మొక్కబోతుంది జానకి. దీంతో వద్దులే ఇక వెళ్లు వెళ్లు అంటూ జానకిని అంటుంది మైరావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.