Vakeel saab : వకీల్ సాబ్ సినిమా సృష్ఠిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ రీ ఎంట్రీ దెబ్బకి కరోనా సెకండ్ వేవ్ కూడా లెక్క చేయకుండా అభిమానుల సందడి తారా స్థాయిలో ఉంది. జస్ట్ థియేట్రికల్ ట్రైలర్ కే థియేటర్స్ బద్దలు కొట్టారంటే ఇక సినిమా రిలీజ్ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో అదుపు చేసే వారు ఎవరన్నా ఉండగలరా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ అన్నీ నిండిపోతాయన్న సంగతి తెలిసిందే. అడ్వాస్ బుకింగ్స్ తో వకీల్ సాబ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
vakeel-saab-is breaking all time records
విదేశాలలో మొదలైన సునామీ ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైంది. విదేశాలలో వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్ పదిరోజుల ముందే మొదలై అన్నీ షోస్ హౌజ్ ఫుల్ అయిపోయాయి. దాదాపు 700 స్క్రీన్స్ లో వకీల్ సాబ్ దిగుతున్నాడు. ఇక ఇండియాలో కూడా అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోస్ కొన్ని చోట్ల ప్లాన్ చేశారు. మరి ఎన్ని చోట్ల అనుమతులు లభిస్తాయో తెలీదు గానీ ఉదయం 7 గంటల నుంచి మాత్రం అన్నీ ప్రాంతాలలో అన్నీ థియేటర్స్ లో వకీల్ సాబ్ దిగడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ వారం రోజుల వరకు హౌజ్ ఫుల్ అయ్యాయని తెలుస్తోంది.
హైదరాబాద్ లో మొదటి రోజు మొత్తం 580 షోలు పడబోతుండగా దాదాపు 95 శాతం బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. వైజాగ్ లో 121 షోస్ కాగా నెల్లూరులో 60 షోలు పడనున్నాయి. అయితే నెల్లూరులో 97 శాతం, వైజాగ్ లో 82 శాతం బుకింగ్స్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి గతంలో ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ మ్యానియా తో నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఊహించని రేంజ్ లో లాభాలు రావడం పక్కా అంటున్నారు. ఇక వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ .. వకీల్ సాబ్ మాట తప్ప మరో మాట వినిపించడం లేదు.
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
This website uses cookies.