Vakeel saab : వకీల్ సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కి రెడీ..!
Vakeel saab : వకీల్ సాబ్ సినిమా ఈ నెల 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ కమర్షియల్ హంగులతో వచ్చి హిట్ టాక్ ని తెచ్చుకుంది. మూడేళ్ళ నుంచి అభిమానులు, ప్రేక్షకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వకీల్ సాబ్ సినిమాతో మంచి ట్రీట్ ఇచ్చాడు. ఇక వకీల్ సాబ్ 100 కోట్ల క్లబ్‌లో చేరినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. నిజంగా అంత వసూలు చేసిందా లేదా అన్నది అధికారకంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించలేదు.
అయినా అభిమానులు మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమాకి నష్టాలు తప్పలేదని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఎ.పి లో టికెట్ రేట్స్ .. కరోనా వల్ల పర్మిషన్స్ ఇవ్వకపోవడం బాగా వకీల్ సాబ్ సినిమాకి మైనస్ అయింది. ఇక మిగతా ప్రాంతాలలో కరోనా ప్రభావమే ఎక్కువగా కనిపించింది. మొత్తానికి వకీల్ సాబ్ సినిమాకి భారీ రేంజ్ లో వస్తాయనుకున్న వసూళ్ళకి కరోనా విపరీతంగా దెబ్బ తీసింది. అందుకే అసలు లెక్కలు కూడా మేకర్స్ దాచేశారన్న మాట వినిపిస్తోంది.
Vakeel saab : వకీల్ సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అందుకే వకీల్ సాబ్ థియేటర్స్ లోకి వచ్చిన 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి తీసుకు వస్తామని చెప్పిన మేకర్స్ అప్పటి వరకు ఎందుకు ఆపడం అని ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైం లో చూసేందుకు వీలుగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ ముప్పై నుంచి అమెజాన్ ప్రైం లో వకీల్ సాబ్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ గా నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నటించింది. ఇక పవర్ స్టార్ అభిమానులు వకీల్ సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.