వకీల్ సాబ్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈ లీకైన ఫొటో చూస్తే అర్థమవుతోంది ..!

Authored By vamana sai | The Telugu News | Published on: January 7, 2021, 2:00 pm

వకీల్ సాబ్ .. పవర్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న వకీల్ సాబ్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వకీల్ సాబ్ .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Pawan Kalyan's 'Vakeel Saab' progressing despite coronavirus scare | The  News Minute

అయితే వకీల్ సాబ్ బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాలో ఫైట్స్ గాని సాంగ్స్ గాని ఉండవు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా కూడా 100 కోట్లు వసూళు చేసింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హిందీ లో పెద్ద సక్సస్ ని అందుకొని సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ఇక ఇదే సినిమాని కోలీవుడ్ లో అజిత్ కుమార్ చేశాడు. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే తమిళంలో కొన్ని మార్పులు చేసి కమర్షియల్ అంశాలను జోడించారు.

ఈ నేపథ్యంలోనే అజిత్ నటించిన పింక్ తమిళ వెర్షన్ నేర్కొండ పార్వై లో యాక్షన్ సీన్స్ ని యాడ్ చేశారు. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ కి ఇంకా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తున్నట్టు మేకర్స్ ముందే వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా శృతిహాసన్ పాత్రని యాడ్ చేశారు. అలాగే క్లైమాక్స్ లో ఫైట్ సీన్స్ ని యాడ్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమాలో ఉన్న ఫైట్ సీన్ కి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతోంది. అయితే ఇది ఎవరో లీక్ చేయలేదట. ఈ సినిమాలో నటించిన దేవ్ గిల్ తన అకౌంట్ ద్వారా షేర్ చేసినట్టు తెలుస్తోంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp