Ramya Krishnan : భార్య రమ్యకృష్ణతో గుండె రాయి చేసుకుని మరీ రంగమార్తాండ షూటింగ్ లో ఆ పని చేసిన కృష్ణవంశీ..!!

Advertisement

Ramya Krishnan : నక్షత్రం సినిమాతో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న కృష్ణవంశీ ప్రస్తుతం ‘ రంగమార్తాండ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రకరకాల కారణాలతో ఈ సినిమా ఆలస్యం అయినా ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 22న విడుదల కాబోతుది. ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూలు చూసి ప్రముఖులు రంగమార్తాండ సినిమా గురించి పాజిటివ్ టాక్ ను ఇస్తున్నారు. ఇది చాలా ఎమోషనల్ సినిమా అని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా చాలా బాధాకరమైందిగా ఉండబోతుందని తెలుస్తుంది.

Vamshi Krishna emotional shoot with Ramya Krishna
Vamshi Krishna emotional shoot with Ramya Krishna

తాజాగా ‘ రంగమార్తాండ ‘ ప్రమోషన్ లో భాగంగా కృష్ణవంశీ కూడా అలానే చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్ లో తన భార్య రమ్యకృష్ణ సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డారని గుండె రాయి చేసుకొని షూటింగ్ చేశానని తెలిపారు. రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశా, రమ్యకు శక్తిమంతవైన కళ్ళు ఉన్నాయి. అరుపులు, కేకలు లేకుండా కేవలం కళ్ళతోనే నటించాలని చెప్పాను. ఆ పాత్ర ఆమె ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే సెట్ చేసుకుంది. తను ఎప్పుడు ఒక విజన్ తో ముందుకెళుతుంది.

Advertisement

రంగమార్తాండ సినిమా చివర్లో చిత్రీకరించడానికి చచ్చిపోయాను, దాదాపుగా 36 గంటల పాటు సన్నివేశాలు షూట్ చేశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డు వచ్చింది. కానీ తప్పదు కదా సినిమా షూట్ చేసేటప్పుడు కళ్ళ వెంబటి నీళ్లు కారాయి. ఆరోజు రాత్రి నేను సరిగా నిద్ర కూడా పోలేదు. ఒకరకంగా చెప్పాలంటే రమ్యతో గుండె రాయి తీసుకొని షూటింగ్ చేశా అంటూ ఎమోషనల్ గా కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ మాటలను బట్టి చూస్తే రమ్యకృష్ణ ఆ సీన్ లో చనిపోయే సన్నివేశం అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజు భార్య రమ్యకృష్ణ నటించింది.

Advertisement
Advertisement