Vamsi Paidipally : విజయ్ – దిల్ రాజుల్‌తో ఇది పెద్ద ఛాలెంజ్..తేడా కొడితే..?
Vamsi Paidipally : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన వారిలో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఒకరు. ఆయన ఇండస్ట్రీకి అడుగుపెట్టి పదేళ్ళు పైనే అయిపోయింది. కానీ, తీసింది మాత్రం చాలా తక్కువ సినిమాలు. 2007లో ప్రభాస్ హీరోగా మున్నా సినిమాతో వంశీ పైడిపల్లి దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలు మాత్రమే చేశాడు. చేసిన ఈ 5 సినిమాలు స్టార్స్‌తోనే. వీటిలో మొదటి సినిమా మున్న ఒక్కటి ఫ్లాప్ అయింది తప్ప మిగతా నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి.
మహర్షి సినిమా అటు మహేశ్‌కు హీరోగా ఇటు వంశీ పైడిపల్లికి దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాదు, అవార్డులు చాలానే వచ్చాయి. అయితే, సక్సెస్ లలో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తాడన్న మహేశ్ బాబు, వంశీతో కలిసి మహర్షి తర్వాత మరో సినిమా చేయాల్సింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత వీరి కాంబినేషన్‌లో దిల్ రాజు భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. లైన్ విన్నప్పుడు బావుంది చేసేద్దాం అని చెప్పిన మహేశ్ …పూర్తి స్క్రిప్ట్ విని నో చెప్పేశాడు. ఇలా చెప్పింది స్క్రిప్ట్ నచ్చకే. దాంతో పలు మార్పులు చేసి కూడా మహేశ్‌తో సినిమా చేయాలనుకున్నాడు వంశీ.
Vamsi Paidipally: ఇక్కడ పాపులారిటీ లేని హీరోతో దిల్ రాజు పెద్ద ప్రయోగమే..
కానీ, కుదరలేదు. ఇప్పుడు అదే కథతో కోలీవుడ్ హీరో తలపతి విజయ్‌తో ఇదే కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నారు. విజయ్‌కు ఇది మొదటి తెలుగు సినిమా. ఇది పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తునాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల విజయ్ బీస్ట్ అనే సినిమాతో వచ్చి అట్టర్ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్‌కు మన తెలుగులో క్రేజ్ అంతంత మాత్రమే. ఒకవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు రిజెక్ట్ చేసిన స్టోరి. దాన్ని ఇక్కడ పాపులారిటీ లేని హీరోతో దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమాగా పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో అతిపెద్ద ఛాలెంజ్ ఎదుర్కోవాల్సింది మాత్రం దర్శకుడు వంశీపైడిపల్లినే. చూడాలి మరి ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ వరకు ఉంటుందో.