Jabardasth Varsha : మిస్ యూ అమ్మా…. తెగ ఎమోషనల్ అయిన వర్ష
Jabardasth Varsha : జబర్దస్త్ షోలోకి వర్ష వచ్చి నాలుగైదేళ్లు అవుతోంది. ఇమాన్యుయేల్ ఆమె కంటే ముందుగానే వచ్చాడు. ఇలా ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా రోజాకు మాత్రం క్లోజ్ అవుతుంటారు. అవ్వాల్సిందే. ఎందుకంటే నాగబాబు వెళ్లిన తరువాత రోజాదే అక్కడ హవా. రోజా చెప్పిందే నడుస్తుంటుంది. రోజా వేసిందే సెటైర్.. చెప్పిందే పంచ్ అన్నట్టుగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ రోజా జబర్దస్త్ షోకు దూరమైంది.రోజాకు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ షోను వదిలేసింది. ఈ రూమర్ గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది…
మూడు నాలుగు వారాల నుంచి రోజా అందులో కనిపించడం లేదు. దీంతో అందరూ మంత్రి పదవి రావడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. అందరూ అనుకున్నట్టే జరిగింది. రోజాకు మంత్రి పదవి వచ్చింది. టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖకు రోజా మంత్రి అయింది.రోజా మంత్రి అయిన సందర్బంలో జబర్దస్త్ ఆర్టిస్టులంతా కూడా ఎమోషనల్ అయ్యారు. మంత్రి అయినందుకు కంగ్రాట్స్ చెబుతూనే జబర్దస్త్ షోను ఒంటరి చేసి వెళ్లిపోవడాన్ని బాధపడ్డారు…
మొత్తానికి జబర్దస్త్ టీం నుంచి రోజా వీడ్కోలు తీసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో నిన్నంతా తెగ వైరల్ అయ్యాయి. అందులో వర్ష షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. మిస్ యూ అమ్మా అంటూ వర్ష తెగ ఎమోషనల్ అయింది. హ్యాపీగా ఉందంటూ.. మరో వైపు బాధగా కూడా ఉందంటూ చెప్పేసింది. మొత్తానికి ఇక జబర్దస్త్ షోలో అయితే రోజా కనిపించదు. ఆ స్థానంలో ఇంద్రజ పూర్తిస్థాయిగా కనిపించబోతోంది.
View this post on Instagram