Varun Tej : పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మారిపోయింది .. మొదటిసారి తన భార్య గురించి చెప్పిన వరుణ్ తేజ్..!
ప్రధానాంశాలు:
Varun Tej : పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మారిపోయింది .. మొదటిసారి తన భార్య గురించి చెప్పిన వరుణ్ తేజ్..!
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ సినిమా టైంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. దాదాపుగా ఆరేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరూ నవంబర్ 1 గ్రాండ్గా ఇటలీలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ తాజాగా ‘ ఆపరేషన్ వాలంటైన్ ‘ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ తో వరుణ్ తేజ్ బిజీగా ఉన్నారు.
అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజీలో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఆ ఈవెంట్ లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ తేజ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. పెళ్లి తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదిలిస్తూ పెళ్లి తర్వాత ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని, కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ఈ సంవత్సరం వాలంటైన్ డే రోజు లావణ్య కి ఏ గిఫ్ట్ ఇచ్చారు అని అడిగితే తనకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని, తను కూడా నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని అన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినీలు అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానాలు ఇచ్చారు. నా సినిమా స్క్రిప్ట్ ఎంపికలో పెదనాన్న చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటానని అన్నారు.
ఆ తర్వాత ఆపరేషన్ వాలంటైన్స్ సినిమా గురించి మాట్లాడుతూ..దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి సినిమాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మాత్రమే కాదు ఈ సినిమాని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. అలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమ కథ సినిమాలు కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరో పై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్ ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతిని ఇచ్చింది అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.