Veera Simha Reddy Movie 5 reasons why you should watch
Veera Simha Reddy Movie : సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన సూపర్ హిట్ చిత్రం వీరసింహారెడ్డి. బాలకృష్ణ, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. బాలయ్య సినిమా అంటే యాక్షన్ కు పెద్దపీట వేస్తారనే సగతి తెలిసిందే.. ప్రతి పండగకు బాలకృష్ణ సినిమా విడుదలవడం ఆనవాయితీగా వస్తుండగా, 2021 డిసెంబర్ లో ‘అఖండ’సినిమాతో తెలుగు సినిమాకు ఓ వెలుగును తీసుకువచ్చిన బాలయ్య సినిమా ఏదీ 2022లో విడుదల కాలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డితో పలకరించాడు.
సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’తో బరిలో ఉండగా, ఈ సినిమాతో పోటీ పడుతుంది వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈరోజు రిలీజైన బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాను కచ్చితంగా ఎందుకు చూడాలంటే.. బాలయ్య సినిమా అంటేనే అదిరిపోయే డైలాగ్స్, సౌండ్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. కాని ఇందులో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా మారాయి .ఈ సినిమా థియేటర్స్ చూడడానికి ఇది ఒక ప్రధాన కారణం . కమల్ గారాలపట్టి శృతి హాసన్ మంచి డ్యాన్సర్. ఆమె అందరు హీరోలతో రెచ్చిపోయి డ్యాన్స్ లు చేస్తూ ఉంటుంది.
Veera Simha Reddy Movie 5 reasons why you should watch
బాలయ్య పక్కన మాస్ సాంగ్స్‌తో దుమ్ముదులిపింది. అందులోనూ సాంగ్స్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అంచనాలు ఎక్కువయ్యాయి. బాలయ్య- శ్రుతి హాసన్ డ్యాన్స్, కెమిస్ట్రీ చూసేందుకు అభిమానులు థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ మ్యూజిక్. నిమాకి మరో బిగ్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ . బాలయ్య ఎంట్రీ అప్పుడు , బాలయ్య ఫైట్ చేస్తున్నప్పుడు. బాలయ్య ఎమోషన్ సీన్స్ డైలాగ్స్ చెప్తూ ఉన్నప్పుడు.. తమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. బాలయ్య ఎంట్రీ అప్పుడు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేక పెట్టిస్తుంది. మరి అభిమానులకి ఇవి కాకుండా ఇంకేం అవసరం చెప్పండి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.