veera simha reddy : నట సింహం బాలయ్య తాజాగా నటించిన ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కొద్దిరోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. నచ్చిన హీరో సినిమా అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే ఇటీవల విలేజ్, సిటీస్లో రచ్చ చేసే అభిమానులు కన్న ఫారిన్ లో అభిమానులు చేసే రచ్చతో కొత్త వివాదాలు తెరపైకి వస్తుండడంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటననే యుఎస్ లో జరిగింది.
మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ను తెరకెక్కించాడు. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా అఖండ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బాలయ్య చాలాకాలం తర్వాత యాక్షన్ సినిమా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. బాలయ్య ద్వితీయ పాత్రలో నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో విడుదలైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఈ సినిమా కోసం ఎలా ఎదురు చూస్తున్నారో, యూఎస్ లో ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలో సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు చేసిన హంగామా వివాదానికి దారితీసింది. ఓ థియేటర్లో బాలయ్య సినిమా మొదలవగానే అభిమానులు కాగితాలు చింపేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఫాన్స్ రచ్చ హద్దులు దాటేయటంతో అర్ధాంతరంగా సినిమా ని నిలిపివేసి గోల చేసిన వారిని థియేటర్ నుంచి బయటకు పంపించేశారు. ఇంతవరకు ఎన్నో సినిమాలను ప్రదర్శించామని అయితే ఎప్పుడు ఇలా జరగలేదని ఈసారి బాలకృష్ణ అభిమానులు రచ్చ చేశారని థియేటర్ యాజమాన్యం చెప్పుకొచ్చింది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.