Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక కొద్ది రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా. ఇక బాలయ్య సినిమాతో పాటు చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చిరంజీవి మైత్రి నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఈ సినిమాలో బాస్ పాట కోసం భారీగా సెట్ వేయించారని, ఆ పాట బాగా వచ్చిన దానికోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సినిమా కథ బాగుంటే అదే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు.
సినిమా మేకింగ్ నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్టర్స్ కూడా సినిమా బాగా వచ్చేలా చూసుకోవాలి అని అన్నారు. బాస్ పార్టీ సాంగ్ సెట్ కోసం మైత్రి నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఆ సెట్ వేసే ముందు నాతో చెప్పి ఉంటే నేను వద్దనే వాడిని అని అన్నారు. అయితే ఈ పాట సెట్ వావ్ అనిపించేలా ఉందని చెప్పారు. మైత్రి నిర్మాతలు మొదటి నుంచి వారి ప్రొడక్షన్లో సినిమాలను భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ నిర్మిస్తుంటారు. సినిమా గ్రాండ్ లుక్ రావడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అందుకే చాలామంది స్టార్ హీరోలు ఈ సంస్థతో వరుస సినిమాలు చేస్తున్నారు.
ఈ నిర్మాణ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. దీనికి కారణం సినిమా కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడమే. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వాల్తేరు వీరయ్య మరో భారీ సినిమా అని తెలుస్తుంది. చిరంజీవి రవితేజ ల మధ్య వచ్చే సీన్స్ కి అభిమానులు విజిల్స్ వేసి గోల గోల చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. డైరెక్టర్ బాబి ఈ సినిమాపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. మరి వీరు చెప్పిన మాటలు చూస్తే సినిమా హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూస్తే వాల్తేరు వీరయ్య సినిమా రిజల్ట్ ఏంటో తెలుస్తుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.