Venkatesh : బాలయ్య సినిమాలో వెంకీ కామియో రోల్.. సినిమా ఏంటంటే..!
ప్రధానాంశాలు:
Venkatesh : బాలయ్య సినిమాలో వెంకీ కామియో రోల్.. సినిమా ఏంటంటే..!
Venkatesh : టంపాలో జరిగిన ‘NATS 2025’ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ సందడి చేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆయన స్టేజిపై తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి తెలిపి అందరిలో క్యూరియాసిటీ పెంచాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. మీ అందరితో పాటు నేను కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Venkatesh : బాలయ్య సినిమాలో వెంకీ కామియో రోల్.. సినిమా ఏంటంటే..!
Venkatesh రేర్ కాంబో..
అలాగే చిరంజీవి గారి సినిమాలో ఒక కామియో చేస్తున్నాను. చాలా ఫన్నీ గా ఉంటుంది అది కూడా. దాని తర్వాత మీనాతో కలిసి ‘దృశ్యం 3’ చేయబోతున్నాను. దాని తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నా స్నేహితుడు నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ పెద్ద సినిమా చేయబోతున్నాను” అంటూ ఆసక్తికర విషయాలు చెప్పారు వెంకటేష్
బాలకృష్ణతో వెంకటేష్ ఒక సినిమా చేస్తాను అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు ఎవ్వరూ ఊహించని కాంబో ఇది. ఏ దర్శకుడు వీరి కాంబోని సెట్ చేశాడు? అనేది అందరిలోనూ ఆసక్తి పెంచే అంశం. అయితే బాలయ్య త్వరలో ఆదిత్య999 సినిమా చేయనుండగా, ఈ సినిమాలో క్యామియో పాత్ర కోసం వెంకీని సంప్రదించినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది