Venkatesh : అందరు హీరోల మాదిరిగానే వెంకటేష్ కూడా బిజినెస్ రంగంలోకి..!
Venkatesh : ఈ మధ్య కాలంలో మన హీరోలు సినిమాలపైనే కాకుండా బిజినెస్‌లపై కూడా దృష్టి సారిస్తున్నారు. సీనియర్ హీరోల నుండి నేటి యంగ్ హీరోల వరకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గతంలో ఓ టీవీ ఛానల్ లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఐపీఎస్ ఫ్రాంచైజీలకు సంబంధించిన కేరళ టీమ్ ని సచిన్ తో కలిసి నాగార్జు చిరంజీవి సహ భాగస్వాములుగా వ్యవహరించారు కూడా.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ రంగంలోకి ప్రవేశించి ఏసియన్ గ్రూప్ తో కలిసి మల్లీ ప్లెక్స్‌లని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరోల తరహాలోనే విక్టరీ వెంకటేష్ కొత్త అడుగులు వేస్తున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం అందించే బైక్ వో కంపెనీలోఎ పెట్టుబడులతో హీరో విక్టరీ వెంకటేష్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
Venkatesh : బిజినెస్ మ్యాన్‌గా వెంకటేష్..!
ఈ కంపెనీలో వెంకీ ప్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు ఈ కంపెనీకి వెంకటేష్ ప్రచార కర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కంపనీలో విక్టరీ వెంకటేష్ ఏ మేరకు పెట్టుబడులు పెట్టారన్నది మాత్రం సంస్థ వెల్లడించలేదు. గత ఏడాది వరుసగా రెండు చిత్రాలతో విజయాల్ని సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది `ఎఫ్ 3`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెట్‌లో కరోనా కలవరం మొదలైనట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ అయితే లేదు.