Venu Swamy : నాగచైతన్య, సమంత లాగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడిపోతారు.. దానికి కారణం నిహారికే అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 12, 2023, 2:04 pm
  •  వరుణ్ తేజ్ కు నాగ దోషం ఉందా?

  •  లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉందా?

  •  గురుడు, శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడా?

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడినా అది మామూలుగా ఉండదు. కాంట్రవర్సీకి కింగ్ అని చెప్పుకోవచ్చు. వేణు స్వామి ఇప్పటికే చాలాసార్లు చెప్పిన విషయాలు నిజం అయ్యాయి. ఇప్పటి వరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకుంటారని ముందే వేణు స్వామి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఇటీవలే మ్యారేజ్ చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ విడిపోతారని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్, లావణ్య కూడా విడిపోతారని చెప్పుకొచ్చారు. దీంతో షాక్ అవడం మెగా ఫ్యాన్స్ వంతు అయింది. ఎందుకంటే.. ఇప్పటికే నాగచైతన్య, సమంత విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి.

ఎందుకంటే.. నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న వరుణ్, లావణ్య జంట మీద ఎందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అని మండిపడుతున్నారు. నిజానికి వాళ్లది లవ్ మ్యారేజ్. అయితే.. వరుణ్ తేజ్ కు నాగ దోషం ఉందని, లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉందని.. వీళ్లిద్దరూ కొంతకాలమే కలిసి ఉంటారని.. గురుడు, శుక్రుడు నక్షత్రాలు వీళ్లవి అని.. ఇవి ప్రస్తుతం నీచ స్థానంలో ఉన్నాయన్నారు. నాగ దోషం, కుజ దోషం ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు కలిసి ఉండరని.. వీళ్ల విషయంలోనూ అదే జరగబోతోందని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

Venu Swamy : వేణు స్వామిపై లీగల్ యాక్షన్

ఇలా.. కొత్త జంటపై ఇలాంటి వ్యాఖ్యలు వేణు స్వామి చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వేణు స్వామిపై కేసు పెడతామని.. లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనా.. నిన్న కాక మొన్న పెళ్లి అయిన జంటపై వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp