Venu Swamy : మళ్లీ వరుణ్ తేజ్‌ని టార్గెట్ చేసిన వేణు స్వామి.. ఆ అమ్మాయి వల్లనే విడాకులు
Venu Swamy : టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్స్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట ఒకటి. ఈ ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా ఉన్న వారు విడిపోతారంటూ ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పలుమార్లు చెబుతుండడం అభిమానులకి తెగ కోపం తెప్పిస్తుంది. వేణు స్వామి.. నాగ చైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు. ఇక అప్పటి […]
ప్రధానాంశాలు:
Venu Swamy : మళ్లీ వరుణ్ తేజ్‌ని టార్గెట్ చేసిన వేణు స్వామి.. ఆ అమ్మాయి వల్లనే విడాకులు
Venu Swamy : టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్స్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట ఒకటి. ఈ ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా ఉన్న వారు విడిపోతారంటూ ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పలుమార్లు చెబుతుండడం అభిమానులకి తెగ కోపం తెప్పిస్తుంది. వేణు స్వామి.. నాగ చైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు. ఇక అప్పటి నుండి పలువురు సెలబ్రిటీలకి సంబంధించి ఏదో ఒక విషయం చెబుతూ నిత్యం వార్తలలో ఉంటాడు..
Venu Swamy : జాతకం వర్కవుట్ అవుతుందా..
అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటకి పెళ్లై ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడు మె జంట విడిపోతుందంటూ కామెంట్ చేశాడు.వారు వీలైనంత త్వరగా విడిపోతారని, ఎక్కువ రోజులు కలిసి ఉండరంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకం ప్రకారం వారిద్దరు కలిసి ఎక్కువ కాలం కలిసి ఉండరు. పెళ్లి అయ్యే యోగ్యం లేకపోయిన వారు పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్ద మిరాకిల్. నేను ఇలా చెప్పినందుకు అందరు నాపై పడి ఏడుస్తుంటారు. విమర్శలు చేస్తుంటారు, ఏవేవో అంటుంటారు. కాని నేను జాతకం ప్రకారం చెబుతున్నా అని వేణుస్వామి అన్నాడు.
వ్యక్తిగతంగా నాకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలతో గొడవ లేదు, బంధుత్వం లేదు. అలాంటప్పుడు వారిని విమర్శించాల్సిన అవసరం నాకు ఏముందని వేణుస్వామి అన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జాతకంలో గురుడు, శుక్రుడు నీచంగా ఉన్నాడని, వాళ్లు కలిసే అవకాశం లేదన్నారు. అంతేకాదు లావణ్య త్రిపాఠికి గురు దోషం, వరుణ్‌కి నాగదోషం ఉందని చెప్పారు. దీనికితోడు నాగదోషం, కుజదోషం లావణ్యని వెంటాడుతుందని, ఇలాంటి దోషాల మధ్య ఈ ఇద్దరు కలిసి ఉండటం పెద్ద మిరాకిల్ అంటూ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. వీరి ఫ్యామిలీలోని ఒక అమ్మాయి వలన వారు విడిపోతారని కూడా తెలిపారు. ఇప్పుడు వేణు స్వామి కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.