Vignesh Shivan And Nayanthara SPecial Pics From Barcelona Vacation
Nayanthara – Vignesh : నయనతార విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం గాల్లో విహరిస్తున్నారు. స్వర్గంలో తేలిపోతోన్నారు. ఇలా ఈ జంట ఎప్పుడూ షికార్లు కొడుతూనే ఉంటుంది. ఒకప్పుడు అయితే రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇలా తిరుగుతుండటంతో అన్ని పాజిటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి. చూడముచ్చటైన జంట అని, చక్కని జంట అంటూ ఇలా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక నయన్‌కు ఆ పసుపు తాడు మీదున్న గౌరవం కూడా అందరినీ ఆశ్చర్యపరిచేస్తోంది.
Nayanthara – Vignesh : మన దేశంలో ఉంటేనే హీరోయిన్లు తాళిని, పసుపుతాడును గౌరవించరు. అసలు వారి వాటిని ధరించరు. అలాంటిది నయన్ మాత్రం ఇలా విదేశాల్లో చక్కర్లు కొడుతున్నా.. ఎటువంటి బట్టలు వేసుకున్నా కూడా నయన్ మాత్రం తన పసుపుతాడుని తీసేయడం లేదు. అదే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక నయన్ ఫోటోలను విఘ్నేశ్ కంటిన్యూగా షేర్ చేస్తూనే ఉన్నాడు. బార్సిలోనా ట్రిప్ మొదలైన క్షణం నుంచి వరుసగా ఫోటోలతో దాడి చేస్తోన్నట్టుగా విఘ్నేశ్ పోస్టుల మీద పోస్టులు పెడుతూనే ఉన్నాడు.
Vignesh Shivan And Nayanthara Cute Pics From Barcelona Vacation
విఘ్నేశ్ నయన్ ప్రస్తుతం బార్సిలోనా వీధుల్లో రచ్చ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే పోజులు ఇస్తున్నారు. వీధుల్లో, సందుల్లో అని తేడా లేకుండా ఫోటోలకు పోజలు ఇస్తున్నారు. తాజాగా నయన్ విఘ్నేశ్ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా అయితే నయన్ ఫోటోలను విఘ్నేశ్ క్లిక్ చేస్తుంటాడు. వికిక్లిక్స్ అంటూ నయన్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. లేదంటే ఎక్కువగా సెల్ఫీ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడి ఫేమస్ ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలను షేర్ చేశాడు.ఇందులో నడి వీధుల్లోనే రొమాంటిక్ పోజులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం నయన్ విఘ్నేశ్ ఫోటోలను చూసి జనాలు ఎంజాయ్ పండుగో అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ జంట పెళ్లై రెండు నెలలకు ఇలా మళ్లీ ఒకసారి ఫారిన్ ట్రిప్ వేసేసి ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.