Vijay Devarakonda : ప‌బ్లిక్‌లో ప‌చ్చి బూతులు మాట్లాడిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇక నువ్వు మార‌వా అంటూ ట్రోలింగ్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vijay Devarakonda : ప‌బ్లిక్‌లో ప‌చ్చి బూతులు మాట్లాడిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇక నువ్వు మార‌వా అంటూ ట్రోలింగ్

Vijay Devarakonda : రౌడీ బాయ్‌గా అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడ‌ని, నోరు జారుతున్నాడ‌ని ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయ‌న ప‌బ్లిక్ లో బూతులు మాట్లాడుతూ కెమెరాల‌కి అడ్డంగా దొరికాడు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఓ రేంజ్‌లో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. వివ‌రాల‌లోకి వెళితే విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijay Devarakonda : ప‌బ్లిక్‌లో ప‌చ్చి బూతులు మాట్లాడిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇక నువ్వు మార‌వా అంటూ ట్రోలింగ్

Vijay Devarakonda : రౌడీ బాయ్‌గా అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడ‌ని, నోరు జారుతున్నాడ‌ని ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయ‌న ప‌బ్లిక్ లో బూతులు మాట్లాడుతూ కెమెరాల‌కి అడ్డంగా దొరికాడు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఓ రేంజ్‌లో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. వివ‌రాల‌లోకి వెళితే విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారాడు. ఆ సినిమాలో విజయ్ దేవ‌ర‌కొండ పాత్ర‌లో మునిగి తేలాడు. ఆటిట్యూడ్, లిప్ లాక్ స‌న్నివేశాలు, రొమాన్స్ ఇలా ప్ర‌తి దాంట్లో కూడా ఆయ‌న అద‌ర‌హో అనిపించాడు.

Vijay Devarakonda ప‌బ్లిక్‌లో ఏంటా ఆ బూతులు..

అయితే ఈ సినిమా త‌ర్వాత విజ‌య్‌కి మ‌ళ్లీ ఆ రేంజ్ పాపులారిటీ తెచ్చిపెట్టిని సినిమా లేదు. చివ‌రిగా లైగ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుద‌ల కానుండ‌గా, కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆ పాత్ర‌ని రిప్ర‌జెంట్ చేసేలా ఈవెంట్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ బైక్‌పై వ‌చ్చాడు. వెన‌క హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని కూర్చోపెట్టుకొని వచ్చాడు.

అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌స్తున్న స‌మ‌యంలో అభిమానులు ఆయ‌న‌ని చుట్టుముట్టే ప్ర‌య‌త్నం చేశారు. సెక్యూరిటీ అడ్డుకుంటున్నా కూడా బైక్‌కి అడ్డంగా కొంద‌రు అభిమానులు వ‌స్తుండ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హ‌నం కోల్పోయి.. ‘అరె జరగండ్రా నీ యబ్బా’ అని గట్టిగా అరిచాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. అభిమానులను అలా పబ్లిక్ లో తిట్టడం ఏమిటంటూ విజ‌య్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే అన‌వ‌స‌రంగా లేని పోని వివాదాల‌లో ఇలా విజ‌య్ చిక్కుకొని త‌న క్రేజ్ త‌గ్గించుకుంటున్నాడ‌ని కొంద‌రు ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో మంచి హిట్ ద‌క్కించుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక పోతే ఫ్యామిలీ స్టార్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది