Vijay Devarakonda : విజయ్ దేవరకొండకి రిక్వెస్ట్.. కాస్త తమ్ముడిని పట్టించుకోవచ్చు కదా భయ్యా
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా హీరో స్థాయికి చేరుకున్నాడు. లైగర్ సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ గా విజయ్ దేవరకొండకు పేరు వస్తుంది అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఆ సినిమా తర్వాత జనగణమన చేస్తున్న విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ పూరి తో హిట్ కొట్టడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు విజయ్ దేవరకొండ మంచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతూ ఉండగా మరో వైపు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాత్రం చిన్నా చితకా సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకొస్తున్నాడు.
దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ అయినా ఆనంద్ దేవరకొండ ఇప్పుడు అదే తరహా సినిమాలను చేస్తూ ఉన్నాడు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న విజయ్ దేవరకొండ తలుచుకుంటే ఆనంద్ దేవరకొండ తో మంచి పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్లతో చేసే అవకాశం ఉంది. కానీ తమ్ముడు గురించి విజయ్ దేవరకొండకు పట్టడం లేదు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ విమర్శలు ఏమాత్రం నిజం కాదు. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ తో పుష్పక విమానం సినిమా ను విజయ్ విజయ్ దేవరకొండ నిర్మించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల విషయంలో ఆనంద్ దేవరకొండ కోసం అన్న రౌడీ స్టార్ ఎంతగా కష్టపడ్డాడో అందరికి తెల్సిందే.ముందు ముందు కూడా మరిన్ని సినిమాలను తమ్ముడు ఆనంద్ దేవరకొండతో నిర్మించాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట.
Vijay Devarakonda : ఆనంద్ దేవరకొండ ప్రతి సినిమా విజయ్ దేవరకొండ ఆధ్వర్యంలోనే..
కచ్చితంగా తమ్ముడు అని ఒక స్థాయికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నాడు అనడంలో సందేహం లేదు. ఆనంద్ దేవరకొండ చేసే ప్రతి ఒక్క సినిమా కు సంబంధించిన కథలు మరియు స్క్రిప్ట్ లను పూర్తిగా విజయ్ దేవరకొండ ఎంపిక చేస్తారని సమాచారం. విజయ్ దేవరకొండ అనుమతి లేకుండా విజయ్ దేవరకొండ యొక్క ప్రోత్సాహం లేకుండా ఆనంద్ దేవరకొండ ఈ స్థాయి వరకు వచ్చే వాడు కాదు అంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ కు విజయ్ దేవరకొండ హెల్ప్ చేయడం లేదు అంటూ కొందరు చేసే వ్యాఖ్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు. విజయ్ దేవరకొండ ఎప్పుడు కూడా ఆనంద దేవరకొండపే పట్టించుకోడు అంటూ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. విజయ్ దేవరకొండ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు.