Vijay Devarakonda Mothers gets Trolled and boycott liger Movie
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మీద, అతని సినిమా మీద ఇప్పుడు రకరకాల వాదనలు తెర మీదకు వస్తున్నాయి. లైగర్ సినిమాను బాయ్ కాట్ చేసేందుకు ఏ చిన్న కారణాన్ని కూడా వదలడం లేదు. కరణ్ జోహర్ నిర్మాతగా ఉన్నాడని కొందరు, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తుందని ఇంకొందరు, ఆమిర్ ఖాన్‌కు మద్దతుగా విజయ్ వ్యాఖ్యలు చేశాడని, పూరి జగన్నాథ్ సినిమాలోని సీన్లు ఆడవాళ్ల మీద వేదింపుల్లా ఉంటాయని మరి కొందరు ఇలా ఎన్నెన్నో కారణాలతో లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ బాయ్ కాట్ పిలుపుల వల్ల ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ రెండు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి.
ఆమిర్ ఖాన్ మీద ఉన్న నెగెటివిటీ లాల్ సింగ్ చడ్డాను నిండా ముంచేసింది. గతంలో ఇండియా మీద, దేవుళ్ల మీద ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్లతో లాల్ సింగ్ చడ్డా మొత్తంగా డిజాస్ఠర్ అయింది. సినిమా విడుదలకు ముందు బాయ్ కాట్ ట్రెండ్ మరింతగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఇదే భయం లైగర్ టీంను పట్టుకున్నట్టు కనిపిస్తోంది. అసలే కరణ్ జోహర్ అంటే నెటిజన్లకు అంతగా నచ్చదు. లైగర్ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాతగా ఉండటంతో బాయ్ కాట్ చేయాలనే పిలుపు ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ట్రెండ్‌ల మీద విజయ్ స్పందించాడు. ఈ బాయ్ కాట్‌లకు మనం ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తున్నామేమో.. అవన్నీ సినిమాను ఏం చేయలేవు అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
Vijay Devarakonda Mothers gets Trolled and boycott liger Movie
ఎంతో కష్టపడి సినిమాను తీశాం.. ఓ తల్లి సెంటిమెంట్.. మన జెండాను ఎగరేసే సినిమాను తీస్తే మీరు బాయ్ కాట్ అని అంటున్నారు.. మీకేం చెప్పగలను.. సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు అని విజయ్ ఎంతో ధీమావ్యక్తం చేశాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తల్లి గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. ఆ కారణం చూపించి బాయ్ కాట్ చేస్తున్నారు. మేం దొరలం.. మాకు గడీలున్నాయి.. ఇప్పటికీ మా ఊర్లో మమ్మల్ని దొరసానులు అని అంటారు.. అని గర్వంగా చెప్పిన మాటలు ఇప్పుడు తప్పుగా, యారగెంట్‌గా చూసి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అందుకే లైగర్‌ను బాయ్ కాట్ చేయండని పిలుపునిస్తున్నారు.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.