Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఆ మత్తులో పడిపోయాడా.. కెరీర్ ఎటు వెళ్లనుంది?
Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దాదాపు పదేళ్లు కష్టపడి టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాకు ముందు చాలా సంవత్సరాల పాటు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. తమ్ముడు ఆనంద్ సంపాదించి డబ్బు పంపిస్తూ ఉంటే నటుడిగా విజయ్ దేవరకొండ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. పెళ్లి చూపులు సినిమా తో మంచి గుర్తింపు రాగా అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ అయ్యాడు. లైగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ ను అవ్వబోతున్నాను అనే నమ్మకంతో విజయ్ దేవరకొండ క్లీయర్ గా కనిపిస్తున్నాడు.వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత రౌడీ స్టార్ నుండి సినిమా రాలేదు.
ఇప్పటి వరకు ఆయన కమిట్ అయిన మరియు విడుదల అయిన సినిమాల విషయంలో ఎలాంటి విమర్శలు వివాదాలు రాలేదు. కాని రౌడీ స్టార్ తాజాగా బ్యాక్ టు బ్యాక్ పూరితో సినిమాలు చేయడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పూరితో సినిమా అంటే స్టార్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వారు. కాని పరిస్తితి ఇప్పుడు సరిగా లేదు. కనుక రౌడీ స్టార్ పూరి తో ఒక్క లైగర్ చేసి ఉంటే సరిపోయేది అంటూ సినీ విశ్లేషకులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది. ఈ ఆగస్టు లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఆ సినిమా తర్వాత ఖుషి సినిమా తో రౌడీ స్టార్ రాబోతున్నాడు.

Vijay Deverakonda and puri back to back movies fans unhappy
ఆ వెంటనే పూరి సినిమా జనగణమన సినిమా ను చేయబోతున్నాడు. పూరి తో పాన్ ఇండియా స్థాయి లో జనగణమన సినిమాను రౌడీ చేయబోతున్న నేపథ్యంలో అభిమానులు ఒకింత ఆందోళనతో ఉన్నారు. లైగర్ సినిమా ఫలితాన్ని బట్టి ఆ సినిమా పై జనాల్లో అంచనాలు ఉండే అవకాశం ఉంది. లైగర్ హిట్ అయితే ఖచ్చితంగా జనగణమన సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఒక వేళ లైగర్ ప్లాప్ అయితే మాత్రం జనగణమన సినిమా ను జనాలు మాత్రమే కాకుండా బయ్యర్లు కూడా పట్టించుకునే అవకాశం ఉండదు. పూరి మాయలో పడి ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం అనేది చాలా రిస్కీ నిర్ణయం అని.. విజయ్ అలా చేయకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.