Kingdom Movie Review : కింగ్‌డమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో..!
ప్రధానాంశాలు:
kingdom Movie Review : కింగ్‌డమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో..!
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు మూడున్నరేళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం బుధవారం అర్థరాత్రి నుంచే యూఎస్ ప్రీమియర్స్ ద్వారా సందడి చేస్తుంది.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్, వెంకటేష్ కేవీ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. కొద్దిసేపటి క్రితమే యుఎస్ ప్రీమియర్ షో ముగియడంతో టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసినవాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. ట్విట్టర్ టాక్ ని బట్టి టైటిల్ కార్డ్ ఎక్స్ లెంట్ గా ఉంది. మంచి ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి, పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్టాఫ్ లో కింగ్డమ్ ని సెట్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని తెలుస్తోంది.

Kingdom Movie Review : కింగ్‌డమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో..!
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో..
సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నదమ్ముల అనుబంధంతో కూడిన ఎమోషన్స్, హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ అన్ని ఆకట్టుకుంటున్నాయి. సత్యదేవ్, భాగ్యశ్రీ తమ పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. టెక్నికల్ గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉందని అంటున్నారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని అంటున్నారు. సెకండాఫ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉందని ట్విట్టర్ రివ్యూలు చెబుతున్నాయి. జైలు సీన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అని పేర్కొన్నారు. గౌతమ్ తిన్ననూరి మంచి కథను రాసుకోవడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు.
ఎమోషన్స్ తో పాటుగా యాక్షన్ కూడా బ్యాలన్సుడ్ గా హ్యాండిల్ చేసినట్టు చెబుతున్నారు. ఎప్పటిలాగే అనిరుధ్ రవిచందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. చాలా సన్నివేశాలను తనం బీజీఎమ్ తో ఎలివేట్ చేసాడు. సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్లో సరికొత్త అనుభూతిని పంచుతోంది.
పూర్తి రివ్యూ మరి కాసేపట్లో..