Vijay Deverakonda : క్రేజీ కాంబినేషన్.. సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ, బాలయ్య.. పూరీ జగన్నాథ్ సూపర్ ప్లాన్ ..!
Vijay Deverakonda : డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా స్టోరి ఉండబోతుండగా, ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే..నందమూరి నటసింహం బాలయ్య ప్రజెంట్ ‘అఖండ’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే.. బాలయ్య ‘లైగర్’ సినిమాలో కనిపించబోతున్నారనే వార్త నెట్టింట హల్ చల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ప్రకారం..
బాలయ్య ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో ఐదు నిమిషాల పాటు కనబడబోతున్నారని, తెరపైన విజయ్ దేవరకొండ-బాలకృష్ణ సందడి చేస్తారని సమాచారం. ఈ క్రేజీ అప్‌డేట్ తెలుసుకుని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనన్యా పాండే నటిస్తోంది. పూరీ జగన్నాథ్ బాలయ్యతో ‘పైసా వసూల్’ అనే ఫిల్మ్ తీశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్‌లో ప్రేక్షకుల మెప్పు పొందగా, ఈ సినిమా సందర్భంగా పూరీ జగన్, బాలయ్య మధ్య బలమైన బంధం ఏర్పడింది.
vijay deverakonda interesting news about liger film
Vijay Deverakonda : వెండితెరపై సందడే సందడి..
ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ రిక్వెస్ట్ మేరకు బాలయ్య ‘లైగర్’ మూవీలో చిన్న రోల్ చేయడానికి ఒప్పుకున్నారని టాక్. చూడాలి మరి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజమెంతో మరి.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే బాలయ్య సినిమాకు ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ అయితే లభిస్తోంది. థియేటర్స్‌లో మాస్ జాతర సాగుతోందని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెవర్ బిఫోర్ అవతార్‌లో బాలయ్య సినిమాలో రెచ్చిపోయారని అంటున్నారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా, బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ కనిపించింది. ఇందులో కీలక పాత్రలో జగపతి బాబు కనిపించారు.