Vijay sethupathi : క్యారెక్టర్ కోసం అలా.. దటీజ్ విజయ్ సేతుపతి

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 4, 2021, 11:05 am

Vijay sethupathi  : సౌత్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటాడు. సైడ్ యాక్టర్ నుంచి ఇప్పుడు నేషనల్ స్టార్ వరకు ఎదిగాడు. ఎన్నో విభిన్న పాత్రలను చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతికి ఇప్పుడు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే తాజాగా విజయ్ సేతుపతి ఓ పాత్ర నుంచి స్వయంగా తప్పుకున్నట్టు తెలుస్తోంది.

విజయ్ సేతుపతి ఆమిర్ ఖాన్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దాని గురించి ఉప్పెన ప్రమోషన్ సమయంలో బుచ్చిబాబు కూడా చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా విజయ్ సేతుపతి ఆమిర్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది మార్చిలోనే విజయ్‌ ఈ సినిమా షూట్‌లో పాల్గొనాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా పరిస్థితులు వేగంగా మారిపోయాయి. అయితే ఈ మధ్యే షూటింగ్ మళ్లీ ప్రారంభించేశారు.

Vijay sethupathi out from Aamir Khan Lal Singh chaddha

Vijay sethupathi out from Aamir Khan Lal Singh chaddha

Vijay sethupathi  : దటీజ్ విజయ్ సేతుపతి

తాజా సమాచారం ప్రకారం విజయ్‌సేతుపతి.. ‘లాల్‌సింగ్‌ చద్దా’ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ప్రాజెక్ట్‌లన్నీ ఒక్కసారిగా పట్టాలెక్కడంతో డేట్స్‌ సర్దుబాటు కాక విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకొన్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల కొన్ని సినిమాల కోసం విజయ్‌ సేతుపతి బాగా బరువు పెరిగారని.. ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రబృందం మాత్రం ఆయన శరీరాకృతి పట్ల సానుకూలంగా లేదని.. దీంతో ఆయనే స్వయంగా తప్పుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పాత్రకు తాను కరెక్ట్ కాదని ఫీలైతే ఎంత పెద్ద సినిమా అయినా సరే పక్కన పెట్టేస్తాడు. దటీజ్ విజయ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp