Vijaya Rangaraju : ప్రముఖ నటుడు, భైరవ ద్వీపం నటుడు విజయ రంగరాజు ఆకస్మిక మరణం
ప్రధానాంశాలు:
Vijaya Rangaraju : ప్రముఖ నటుడు, భైరవ ద్వీపం నటుడు విజయ రంగరాజు ఆకస్మిక మరణం
Vijaya Rangaraju : ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చాలా సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించారు.ఆయన ఆకస్మిక మరణం చెందారు. చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో ఆయన గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్ Hyderabad లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగరాజు ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ హార్ట్ అటాక్‌తో మరణించారు. రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో అలరించారు రంగరాజు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా ఫస్ట్ మూవీ. అయితే నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది .
Vijaya Rangaraju నివాళులు..
కెరీర్ టర్నింగ్ చిత్రం ‘భైరవ ద్వీపం’ చిత్రం. ఈ సినిమాలో నటనకుగాను మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత విజయ రంగరాజు కెరీర్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే ‘యజ్ఞం’ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన ఆయన, ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో రంగరాజుకు ప్రావీణ్యం ఉంది. విజయ రంగరాజు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కెరీర్‌ను స్పోర్ట్స్‌లో ప్రారంభించారు. తర్వాత నటన మీద ఆసక్తితో మద్రాసులోని రంగస్థల కళాకారునిగా చేశారు.
స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు వియత్నాం అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. మోహన్ లాల్ హీరోగా చేసిన ఈ సినిమాలో విజయ రంగరాజు విలన్‌గా చేశారు. తర్వాత తెలుగులో 1994లో భైరవద్వీపంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. బాలయ్య హీరోగా చేసిన ఈ సినిమా తెలుగులో మంచి హిట్‌ని అందుకుంది. భైరవ ద్వీపం భారీ హిట్‌గా నిలిచినా.. విజయ రంగారాజుకు అవకాశాలు దక్కలేదు. తర్వాత మగరాయుడు అనే సినిమాలో నటించారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించి బ్రేక్ తీసుకున్నారు. గోపిచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన ఢమరుకం, బ్యాండ్ బాజా సినిమాల్తో కూడా మంచి గుర్తింపు వచ్చింది.విజయ రంగరాజు నటనలోకి రాకముందు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లోనూ పాల్గొన్నారు. విశాఖ ఎక్స్ ప్రెస్, ఢమరుకం, బ్యాండ్ బాజా,శ్లోకం` చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ రంగ రాజు.