Venkatesh : హీరో వెంకటేష్ ని టార్గెట్ చేసిన విజయశాంతి !

Advertisement

Venkatesh : ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే తాజాగా ఆమె టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేసిన వెబ్ సిరీస్ మీద పరోక్షంగా కామెంట్స్ చేశారు. వెంకీ నటించిన నెట్ ఫ్లిక్స్ షో ‘ రానా నాయుడు ‘ సిరీస్ గురించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి షోలు వచ్చినప్పుడల్లా ఓటిటి కంటెంట్ కు సెన్సార్ ఉండాలనే చర్చ జరుగుతుంది.

Vijaya Shanti target to Daggubati Venkatesh 
Vijaya Shanti target to Daggubati Venkatesh

విజయశాంతి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రానా నాయుడు పేరు పెట్టకుండా ఇటీవల విడుదలైన ఒక తెలుగు టీవీ షో అని పేర్కొంటూ ఆమె విమర్శలు చేశారు. ఓటీటీలకు సెన్సార్ ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యేకించి ఆడవాళ్లు నివేదిస్తున్నారని, ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఓటిటిలో అసభ్యతతో కూడిన కంటెంట్ తొలగించేలా చూడాలని, ప్రజల వ్యతిరేకతతో కూడిన ఉద్యమాలదాక తెచ్చుకోవద్దని విజయశాంతి హెచ్చరించారు. అలాగే ఆమె మాట్లాడుతూ ఇంకా కొన్ని విమర్శలు చేశారు.

Advertisement

Shatruvu Movie || Venkatesh & Vijayashanti Emotional Scene || Venkatesh, Vijayashanti - YouTube

నటులకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను, రాబోయే రోజుల్లో ఓటిటీ ప్రసారాలు ప్రజలు, మహిళా వ్యతిరేకతకు గురికాకుండా ఉంటాయని భావిస్తున్నాను అని హితవు పలికారు. ఇక విజయశాంతి అంతకుముందు రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తాను రాజకీయాల్లో ఉండగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలతో మనస్థాపం చెందినట్లు వెల్లడించారు. కానీ విజయశాంతి మాత్రం ఇవన్నీ రాజకీయాల్లో సహజం అని అన్నారు.

Advertisement
Advertisement