Viral News : కాటేసిన పాముని పళ్ళతో కొరికి చంపిన రెండేళ్ల చిన్నారి… ఆ తర్వాత ఏమైందంటే…!
Viral News : చిన్నపిల్లలకు అమ్మ తప్ప మరో లోకం ఉండదు. ఆకలి వేస్తే పాలు తాగుతారు, ఆ తర్వాత ఆడుకుంటారు. వారి నవ్వు స్వచ్ఛంగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. మంచి చెడులు, తప్పొప్పులు ఏమి తెలియవు. అందుకే ఒక్కోసారి తమకు తెలియని పనులు చేసి ప్రమాదంలో పడతారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఓ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. టర్కీలోని బింగోల్ నగరంలో ఉన్న కాంటార్ అనే చిన్న గ్రామంలో ఆగస్టు 10 ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రి పనికి వెళ్ళాడు. తల్లి ఇంట్లో పనులు చేస్తుంది. ఆ సమయంలో చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుంది.
ఎటు నుంచి వచ్చిందో కానీ ఒక పాము పాప వద్దకు వెళ్లి ఆ చిన్నారిని కాటేసింది. దాదాపు అర మీటర్ పొడవున్న పాము చిన్నారి పెదాలపై కరిచింది. పాము కరవడంతో పాపకు కోపం వచ్చింది. వెంటనే దానిని చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకుని పళ్ళ కింద ఉంచి గట్టిగా కొరికింది. ఎడాపెడా కొరికేయడంతో ఆ పాము చనిపోయింది. ఆ తర్వాత పాప గట్టిగా ఏడవటంతో తల్లి పరిగెత్తుకొచ్చి బాలిక నోటికి రక్తపు మరకలు ఉండడం, అక్కడే ఒక పాము చనిపోయి ఉండడం దానిపై పంటి గాట్లు ఉండడంతో తల్లి కంగారు పడింది. తన కూతురు పామును కొరికి చంపిందని, అదే సమయంలో పాప పెదాలపై పాము కాటేసిన ఆనవాళ్ళు ఉండడంతో భయపడిపోయింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో బింగోలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు బాలిక పెదాలపై పాము కాటు వేసినట్లు నిర్ధారించారు. సరైన సమయంలో పాము కాటుకు విరుగుడు మందుని ఇచ్చారు. అనంతరం పాపని 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ఆ చిన్నారి క్రమంగా కోరుకుంది. ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ పాప బతికిందని ఆనందపడ్డారు. ప్రస్తుతం ఈ పాప గురించి టర్కీ ప్రజలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దాదాపు 45 రకాల పాములు నివసిస్తున్నాయి. అందులో 12 రకాల పాములు అత్యంత విషపూరితమైనవి. కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం ఈ పాప తన అదృష్టం వల్ల బతికి బయటపడిందని అందరూ అనుకుంటున్నారు.