Manchu Vishnu : కన్నప్పకి సంబంధించిన ఆశ్చర్యపోయే విషయాలు బయట పెట్టిన మంచు విష్ణు.. రెమ్యునరేషన్ భారీగానే..!
Manchu Vishnu : మంచు విష్ణు Manchu Vishnu ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమా Kannappa Movie ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుండి శివ శివ శంకర Shiva Shiva Shankara సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ఏకంగా 6.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.టీ సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో ఈ సాంగ్ అందుబాటులో ఉంది.ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డా.మోహన్ బాబు Mohan Babu దాదాపు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
Manchu Vishnu : మోహన్ బాబుపై గౌరవంతో..
విష్ణు మంచు Manchu Vishnu ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి.. ముకేష్ కుమార్ సింగ్ Mukesh Kumar Singh దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, Prabhas మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ BollyWood యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు ఈ సినిమాకు ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా.. అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
![Manchu Vishnu కన్నప్పకి సంబంధించిన ఆశ్చర్యపోయే విషయాలు బయట పెట్టిన మంచు విష్ణు రెమ్యునరేషన్ భారీగానే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/vishnu.jpg)
Manchu Vishnu : కన్నప్పకి సంబంధించిన ఆశ్చర్యపోయే విషయాలు బయట పెట్టిన మంచు విష్ణు.. రెమ్యునరేషన్ భారీగానే..!
ఈ సినిమా కోసం ప్రభాస్ Prabhas , మోహన్ లాల్ Mohanlal ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని ఆయన చెప్పారు..ప్రభాస్, Prabhas, Mohanlal మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారని వాళ్లు కథ చెప్పగానే అంగీకరించారని విష్ణు పేర్కొన్నారు. మోహన్‌లాల్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ, తన పారితోషికం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన నవ్వుతూ, “ఇప్పుడు నువ్వు అంత పెద్దవాడివైపోయావా? అని అన్నారని చెప్పారు. ఇది మోహన్‌లాల్, ప్రభాస్‌ల నిజమైన వినయం, సరళతను ప్రతిబింబిస్తుందని విష్ణు స్పష్టం చేశారు.