Prabhas : శివ రాత్రికి రెబల్ స్టార్ ప్రభాస్ డబల్ ట్రీట్ ఫిక్స్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
ప్రధానాంశాలు:
Prabhas : శివ రాత్రికి రెబల్ స్టార్ డబల్ ట్రీట్ ఫిక్స్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ఫెస్టివల్ అన్నట్టే లెక్క. కొన్నాళ్లుగా ప్రభాస్ సినిమాల గురించి సరైన అప్డేట్స్ ఇవ్వట్లేదని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక మరోపక్క మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కూడా రుద్ర పాత్రలో నటిస్తున్నాడు. ఐతే ఈ రెండు సినిమాల నుంచి త్వరలో ఒక అదిరిపోయే టీజర్ రాబోతుందని తెలుస్తుంది. కన్నప్ప సినిమాకు సంబందించిన టీజర్ మహా శివరాత్రికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక మరోపక్క రెబల్ స్టార్ లీడ్ రోల్ లో నటిస్తున్న రాజా సాబ్ టీజర్ ని కూడా శివ రాత్రికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
Prabhas : రాజా సాబ్ టీజర్ ని కూడా శివ రాత్రికి..
శివ రాత్రికి రెండు టీజర్స్ తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నందీశ్వరుడి గెటప్ తో వస్తున్నాడు. ఈ సినిమాలతో ప్రభాస్ మరోసారి తన మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు. రెబల్ స్టార్ రాజా సాబ్ సినిమా మాత్రం థ్రిల్లర్ జోనర్ లో రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు ఐతే ఒక దానికి మించి మరొకటి ఉండేలా ఉందని చెప్పొచ్చు.
ఈ దెబ్బతో రెబల్ స్టార్ మాస్ స్టామినా ఏంటన్నది బాక్సాఫీస్ పై చూపించే ఛాన్స్ ఉంటుంది.
దల హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ని తలపించేలా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. రాజా సాబ్, కన్నప్ప సినిమాల టీజర్ ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుంది. ఐతే ఈ టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై మరింత బజ్ పెరిగే ఛాంచె ఉంది. Rebal star, Prabhas, Raja Saab, Kannappa, Manchu Vishnu