Prabhas : కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.. రుద్ర పాత్ర లుక్ అదిరింది..!
ప్రధానాంశాలు:
Prabhas : కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.. రుద్ర పాత్ర లుక్ అదిరింది..!
Prabhas : మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా Kannappa Movie లో మన రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ రుద్ర గెటప్ అదిరిపోయింది.
Prabhas కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ రుద్ర పోస్టర్
కన్నప్ప సినిమాలో రుద్ర పాత్ర ఉన్న డ్యురేషన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్ ఇలా అందరు కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు. మంచు విష్ణు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నాడు.
కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ రుద్ర పోస్టర్ సినిమాపై హ్యూజ్ బజ్ ఏర్పడేలా చేసింది. చూస్తుంటే మంచు విష్ణు ఈ సినిమాతో సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో కాజల్ కూడా నటిస్తుంది. కన్నప్ప టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న మంచు విష్ణు సినిమాలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త్ పడినట్టు కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. Prabhas, Manchu Vishnu, Kannappa, Rebal Star, Mohan Babu