Vishnu Priya : అబ్బాయిలు విప్పుకుని తిరిగితే అలా.. అమ్మాయిల్లో అది కనిపిస్తే ఇలా.. విష్ణుప్రియ పరోక్షంగా సెటైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : అబ్బాయిలు విప్పుకుని తిరిగితే అలా.. అమ్మాయిల్లో అది కనిపిస్తే ఇలా.. విష్ణుప్రియ పరోక్షంగా సెటైర్

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఈ మధ్య బుల్లితెరపై కనిపించడమే మానేసింది. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటోంది. అవకాశాలు లేకనో, రాకనో కానీ విష్ణుప్రియ మాత్రం తెరపైకి రావడం లేదు. చివరకు ఇన్ స్టా రీల్స్, పోస్టుల్లోనే ఆమెను చూడాల్సి వస్తుంది. మధ్యలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా చేసింది. ఇక కొన్ని రోజుల్లోనే ఆమె సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. వాంటెడ్ పండుగాడ్ అనే చిత్రంలో విష్ణుప్రియ నటించింది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2022,7:20 pm

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఈ మధ్య బుల్లితెరపై కనిపించడమే మానేసింది. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటోంది. అవకాశాలు లేకనో, రాకనో కానీ విష్ణుప్రియ మాత్రం తెరపైకి రావడం లేదు. చివరకు ఇన్ స్టా రీల్స్, పోస్టుల్లోనే ఆమెను చూడాల్సి వస్తుంది. మధ్యలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా చేసింది. ఇక కొన్ని రోజుల్లోనే ఆమె సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. వాంటెడ్ పండుగాడ్ అనే చిత్రంలో విష్ణుప్రియ నటించింది. ఈ సినిమా ఆగస్టులోనే రాబోతోంది. అంతకు ముందు ఆహా కోసమే ఓ వెబ్ సిరీస్ చేసింది. అది అంతగా వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా అయినా ఆమెకు పేరు తెస్తుందో లేదో చూడాలి.

ఇందులో అసలే చాలా మంది కనిపిస్తున్నారు. సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియ, అనసూయ వంటి వారు కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు విష్ణుప్రియ మాత్రం నెట్టింట్లోనే యాక్టివ్‌గా ఉంటూ.. తన సినిమాకు ప్రమోషన్స్ చేసుకుంటోంది. ఇక ఈ మధ్య కాలంలో రణ్‌వీర్ సింగ్ నగ్నంగా ఉన్న పిక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రణ్ వీర్ ఫోటో మీద నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. కొంత మంది ఆ ఫోటోను తిట్టి పోస్తుంటే.. రణ్ వీర్ సింగ్‌ను నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆహా ఓహో అంటూ.. గట్స్ అంటూ పొగిడేశారు. ఇక కొందరు అయితే ఇలానే ఆడవాళ్లు చేస్తే ఊరుకుంటారా? వాళ్లు చేస్తే ధైర్యం.. మేం చేస్తే నీచమా? అంటూ ఆడవాళ్లు ఫైర్ అవుతూ వచ్చారు.

Vishnu Priya Satires on Ranveer Singh Naked Pic And Heroines Exposing

Vishnu Priya Satires on Ranveer Singh Naked Pic And Heroines Exposing

తాజాగా విష్ణుప్రియ కూడా ఓ పోస్ట్ వేసింది. అందులోనూ తన ఉద్దేశ్యం అలానే ఉంటుందని చెప్పకనే చెప్పింది. మగవాళ్లు బట్టలేమీ వేసుకోకుండా ఫోటో షూట్ చేస్తే.. గట్స్ అని మెచ్చుకుంటారా? అదే ఆడవాళ్లు వారి క్లీవేజ్, నడుము చూపించినా కూడా తప్పని అంటారా? అంటూ ప్రశ్నిస్తూ నిలదీసిన వీడియోను షేర్ చేసింది విష్ణుప్రియ. అంటే మొత్తానికి విష్ణుప్రియ కూడా ఎక్స్ పోజింగ్ చేస్తుంది కాబట్టి తాను కూడా అలానే ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

Anchor Vishnupriya Satires on Ranveer Singh Naked Pic And Heroines Exposing

Anchor Vishnupriya Satires on Ranveer Singh Naked Pic And Heroines Exposing

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది