Jwala Gutta : ముద్దుల వ‌ర్షంలో త‌డ‌చిపోయిన హీరో.. భ‌ర్త‌పై గుత్తా జ్వాల‌కి అంత ప్రేమ ఎందుకు వ‌చ్చిందో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jwala Gutta : ముద్దుల వ‌ర్షంలో త‌డ‌చిపోయిన హీరో.. భ‌ర్త‌పై గుత్తా జ్వాల‌కి అంత ప్రేమ ఎందుకు వ‌చ్చిందో..!

 Authored By sandeep | The Telugu News | Updated on :17 July 2022,5:30 pm

Jwala Gutta : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల‌, కోలీవుడ్ న‌టుడు విష్ణు విశాల్ కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలిన విష‌యం తెలిసిందే. అయితే ఏప్రిల్ 22 చెన్నైలో వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది..2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని జ్వాల మ్యారేజ్ చేసుకున్నారు. పలు కారణాలతో 2011లో విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు.. విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. వీరికి ఆర్యన్ అనే బాబు ఉన్నాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విష్ణు, జ్వాల కంటే ఒక సంవత్సరం చిన్నవాడు కావడం, వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం..

గతకొద్ది కాలంగా లవ్, డేటింగ్ వంటి వార్తల్లో నిలిచిన ఈ జంట పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక ఇటీవ‌ల ఈ జంట యానివ‌ర్స‌రీ కూడా జ‌రుపుకున్నారు. ఆ రోజు త‌న సోష‌ల్ మీడియాలో భ‌ర్త గారికి తొలి వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ ప్రేమతో పేర్కొన్న జ్వాల… బాధ్య‌త క‌లిగిన‌, బాగా చూసుకునే భార్య దొరికిన భ‌ర్త‌గా తమ‌రు భావిస్తున్నారని చెప్ప‌గ‌ల‌ను అంటూ త‌మ వివాహ బంధంపై ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. గుత్తా చెప్పిన మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా గుత్తాను పెళ్లి చేసుకున్న‌త‌ర్వాత ఎఫ్ఐఆర్ పేరిట విష్ణు విశాల్ తీసిన సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.ఇక విష్ణు విశాల్ బర్త్ డే నేడు కాగా,ఆయ‌న‌పై ముద్దుల వర్షం కురిపించింది.

vishnu vishal birthday special

vishnu vishal birthday special

Jwala Gutta : ముద్దుల వ‌ర్షం..

అందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి షాక్ ఇచ్చింది. గుత్తా జ్వాల పోస్ట్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాగా, కోలీవుడ్‌ యంగ్‌ హీరో విష్ణు విశాల్‌ కథానాయకుడిగా మను ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’. విష్ణు విశాల్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఫిబ్రవరి 11న విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌ సంపాందించుకుంది. మాస్‌ మహారాజ రవితేజ సమర్పణలో అభిషేక్‌ నామా ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అనేక వివాదాల నడుమ రిలీజైన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ మరో సినిమా రానుంది. రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ ‘మట్టి కుస్తీ’ అంటూ క్రీడా నేపథ్యంలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది