Vishwak Sen : గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన విశ్వ‌క్ సేన్.. మా సినిమాని లేప‌మ‌న‌లేదు,అభినందించ‌మ‌ని మాత్ర‌మే అన్నా | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vishwak Sen : గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన విశ్వ‌క్ సేన్.. మా సినిమాని లేప‌మ‌న‌లేదు,అభినందించ‌మ‌ని మాత్ర‌మే అన్నా

Vishwak Sen : కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటాడు విశ్వ‌క్ సేన్.ఆయ‌న న‌టుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటూ ఎదుగుతూ వ‌స్తున్నారు. అయితే విశ్వక్ సేన్ ఇటీవ‌లి కాలంలో హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా ఆయ‌న న‌టించిన చిత్రం గామి. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంది ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇక మూవీలో విశ్వ‌క్ సేన్ న‌ట‌నకి మంచి మార్కులు […]

 Authored By tech | The Telugu News | Updated on :15 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Vishwak Sen : గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన విశ్వ‌క్ సేన్.. మా సినిమాని లేప‌మ‌న‌లేదు,అభినందించ‌మ‌ని మాత్ర‌మే అన్నా

Vishwak Sen : కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటాడు విశ్వ‌క్ సేన్.ఆయ‌న న‌టుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటూ ఎదుగుతూ వ‌స్తున్నారు. అయితే విశ్వక్ సేన్ ఇటీవ‌లి కాలంలో హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా ఆయ‌న న‌టించిన చిత్రం గామి. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంది ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇక మూవీలో విశ్వ‌క్ సేన్ న‌ట‌నకి మంచి మార్కులు ప‌డ్డాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో మూవీ బాగా వచ్చింద‌ని కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

అంతేకాదు దర్శకుడు విద్యాధర్ కగితకు, హీరో విశ్వక్‍పై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.. మార్చి 8న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.20కోట్లకుపైగా వసూళ్లను రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. ప్ర‌యోగాత్మ‌క మూవీగా ఈ చిత్రానికి ఆడియ‌న్స్ మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. అయితే, సెలెబ్రిటీలు పెద్దగా ఈ చిత్రం గురించి మాట్లాడక‌పోయేస‌రికి విశ్వ‌క్ సేన్ హ‌ర్ట్ అయ్యాడు. త‌న చిత్రానికి ప్ర‌ముఖుల నుండి పెద్ద‌గా మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌ని భావించిన విశ్వక్ సేన్.. ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో గామి లాంటి సినిమా ఇంతకు ముందెప్పుడూ రాలేదని తాను గర్వంగా చెబుతున్నా. ఇది మన తెలుగు సినిమా అని, నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడితే బాగుంటుందని విశ్వక్ అన్నారు.

గామి సినిమా నచ్చని వాళ్లకు కూడా నచ్చుతుందని విశ్వక్ అన్నాడు. కొంద‌రు క‌న్ఫ్యూజింగ్‌గా ఉంద‌ని అంటున్నారు, ఎందుకు వారికి కన్ఫ్యూజ్ అవుతుందో నాకు తెలియ‌డం లేదు. ఇందులో అఘోర క్యారెక్టర్ నేను చేయలేనని అనుకున్నా. కాని మీ కోసం ట్రై చేశా. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా తెలుగులో ఇలాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఇది అవుతుంది. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల త‌ర్వాత నేను ఈ మాట‌లు చెబుతున్నానంటే అర్ధం చేసుకోవ‌చ్చు. మా సినిమాని ఆకాశానికి ఎత్త‌మ‌ని నేను అడగలేదు. అభినందమించి మాత్రమే అడిగానంటూ విశ్వ‌క్ అన్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ప్రేమ‌లు చిత్రానికి మ‌హేష్ బాబు, రాజమౌళి వంటి ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు ల‌భించింది. త‌న సినిమాపై ఏ సెల‌బ్రిటీ కామెంట్ చేయ‌లేద‌నే విశ్వక్ అలా మాట్లాడి ఉంటాడ‌ని భావిస్తున్నారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది