Waltair Veerayya – Veera Simha Reddy : వాల్తేరు వీరయ్య – వీర సింహా రెడ్డి .. ఈ రెండిటికీ ఉన్న తేడా ఇదే ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Waltair Veerayya – Veera Simha Reddy : వాల్తేరు వీరయ్య – వీర సింహా రెడ్డి .. ఈ రెండిటికీ ఉన్న తేడా ఇదే ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 January 2023,10:00 am

Waltair Veerayya – Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతోనే విడుదలై బిగ్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో ప్లస్ మైనస్ ల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమాలో ఉంది వీరసింహారెడ్డి సినిమాలో లేనిది అదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి

సినిమాలో బాలయ్య పవర్ఫుల్ ఫ్యాక్షన్ పాత్రలో కనిపించాడు. ముందు నుంచి బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందని భావించారో అలానే డిజైన్ చేశాడు డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్స్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బాలయ్య కనిపిస్తాడు. అలాగే కామెడీ కూడా ఎక్కువగా ఉండదు. అదే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఫ్యాక్షనిజం, ఫుల్ పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ అసలు లేవు. సినిమా మొదటినుంచి చివరిదాకా చిరంజీవి ఫుల్ మాస్ పర్ఫామెన్స్, రవితేజ పవర్ఫుల్ పర్ఫామెన్స్ హీరోయిన్స్ శృతిహాసన్ కేథరిన్ల అందాల ప్రదర్శన హైలైట్ గా మారింది.

waltair veerayya and Veera simha reddy cinema difference

waltair veerayya and Veera simha reddy cinema difference

ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, శృతిహాసన్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ అదరగొట్టాయి. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య సినిమాలో కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉందని థియేటర్స్ కి వెళ్లి నవ్వుకోవచ్చు అని అదే వీర సింహారెడ్డి వెళ్తే ఫుల్ యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ చూసి ఎంజాయ్ చేయాలని సినిమాలో ఉన్న బిగ్ డిఫరెన్స్ ఇదే అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇకపోతే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తున్నది మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది