Shriya Saran : చిరంజీవి సినిమా లో నటించమని అడిగితే శ్రియ అంత మాట అనేసింది ఏంటి !

Authored By Breaking News | The Telugu News | Updated on : 21 April 2023, 5:00 pm

Shriya Saran : ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరుసు పెట్టి సినిమాలు చేస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ స్థానంలో ఉన్నారు. పాండమిక్ తర్వాత చాలామంది సినిమాలు చేసే విషయంలో స్లో అయిపోయారు. కానీ చిరంజీవి, రవితేజ అందరికీ భిన్నంగా వేగవంతంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలంటే భారీ ఎత్తున క్రేజ్ ఉండేది. కానీ రాజకీయాల్లోకి వెళ్ళటం అక్కడ బోల్తా పడటం మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడంతో కొద్దిగా క్రేజ్ తగ్గటం తెలిసిందే. ఈ లోపు మధ్యలో మహేష్ మరి కొంతమంది హీరోలు రేజ్ అవ్వడంతో ..

what did Shriya Saran say when asked to act in chiranjeevi film

what did Shriya Saran say when asked to act in chiranjeevi film

ఇండస్ట్రీలో లెక్కలు మారాయి. పైగా చిరంజీవి వయసు కూడా మీద పడటంతో ఒకప్పుడు ఆయన పక్కన నటించడానికి పోటీపడ్డ హీరోలు ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో.. సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. తమిళ్ లో అజిత్ నటించిన “వేదాళం” నీ తెలుగులో “భోళా శంకర్” గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ శ్రియనీ తీసుకోవడానికి మేకర్స్ సంప్రదించగా ఊహించని షాక్ ఇవ్వటం జరిగిందంట.

shriya saran latest pics viral on twitter

shriya saran latest pics viral on twitter

మేటర్ లోకి వెళ్తే ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటం జరిగిందట. ఒక్క సాంగ్ కోసం అంత అడగటంతో… మేకర్స్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా వెనక్కి వచ్చేయడం జరిగిందట. 40 ఏళ్ల వయసు కలిగిన శ్రీయ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లయినా గాని… భారీ ఎత్తున ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. దీంతో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకునీ చిరంజీవి పక్కన స్టెప్ లేయాలని శ్రియని సంప్రదిస్తే కోటి రూపాయలు డిమాండ్ చేయటంతో ప్రొడ్యూసర్లకు చుక్కలు కనబడి సైలెంట్ అయిపోయారు అంట. కేవలం ఐదు నిమిషాల సాంగ్ కి అంత రేట్ అనవసరమని డ్రాప్ అయినట్లు సమాచారం.

Advertisement

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి