Veera Simha Reddy : ఎన్ని కోట్లు వస్తే బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా హిట్ అయినట్టు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Veera Simha Reddy : ఎన్ని కోట్లు వస్తే బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా హిట్ అయినట్టు?

 Authored By kranthi | The Telugu News | Updated on :12 January 2023,6:20 pm

Veera Simha Reddy : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులకు అందరికీ ఇవాళ్టి నుంచే సంక్రాంతి పండుగ ప్రారంభం అయింది. అది బాలయ్య సినిమాతో. నిజానికి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా థియేటర్లలోకి రావాల్సిందే. బాలకృష్ణ అభిమానులు ముందే సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిందే. తాజాగా అదే జరిగింది. ఈసారి కూడా వీరసింహారెడ్డి పేరుతో బాలకృష్ణ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నిజానికి ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా. బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ సినిమాను అభిమానులు ఎప్పటి నుంచో కావాలని కోరుతున్నారు. చివరకు వీరసింహారెడ్డి ద్వారా బాలకృష్ణ మళ్లీ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలో నటించగలిగారు. ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. పైగా అఖండ తర్వాత బాలయ్య బాబు నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే.. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమాకు అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

what is the break even point for success of Veera Simha Reddy

what is the break even point for success of Veera Simha Reddy

Veera Simha Reddy : బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ బిజినెస్ హయ్యెస్ట్ అని చెప్పుకోవాలి. తెలంగాణ, ఏపీ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు రూ.61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.73 కోట్ల బిజినెస్ జరిగింది. నిజానికి.. అఖండ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెసే జరిగింది. కానీ.. ఇప్పుడు వీరసింహారెడ్డికి మాత్రం అదనంగా రూ.13 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే.. ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే.. కనీసం రూ.74 కోట్ల షేర్ రావాలి. ఈ షేర్ వచ్చిందటే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నట్టే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది