RRR Movie : ఆర్ఆర్‌ఆర్ రెండేళ్ల ఆలస్యంతో లాభం 1, నష్టాలు 99
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్‌ఆర్ సినిమా మళ్లీ వాయిదా పడింది. సినిమా ప్రారంభించిన సమయంలో 2020 సంవత్సరం లో జులై 30న విడుదల చేస్తామంటూ రాజమౌళి అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్ మీద డేట్ ను కూడా వేశాడు. ఆ సమయంలో షూటింగ్ ఆలస్యం అవ్వడం హీరోలకు గాయాలు ఇతర విషయాల కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యి 2021 సంక్రాంతి రేసులో నిలిచింది. కరోనా వల్ల 2021 సమ్మర్ కు వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ తో 2022 సంక్రాంతి కి విడుదల చేస్తామన్నారు.. కాని ఒమిక్రాన్ వల్ల మళ్లీ జులై 2022 కి వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కాని ఖచ్చితంగా 2022 జులైలో సినిమాను విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
సినిమాను ప్రారంభించింది 2018 లో మొదట విడుదల చేస్తాం అంటూ ప్రకటించింది 2020 లో అంటే సినిమా రెండేళ్ల ఆలస్యం. అంతకు ముందు రెండేళ్లు.. అంటే మొత్తం నాలుగేళ్లుగా ఈ సినిమా జనాలను ఊరిస్తూ వస్తోంది. ఏదైనా ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఏడాది లోపు పూర్తి అయ్యి విడుదల అయితేనే నిర్మాతకు రెవిన్యూ విషయంలో పాజిటివ్ లెక్కలు నమోదు అవుతాయి. అదే విడుదల ఆలస్యం అయితే పెట్టిన పెట్టుబడి మాత్రమే కాకుండా ఆ పెట్టుబడికి వడ్డీ కూడా అదనపు భారంగా నిలుస్తూ ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా బడ్జెట్ ను 350 నుండి 400 కోట్ల మద్య చెబుతూ ఉన్నారు. ఈ మొత్తం బడ్జెట్ ను ఇప్పటికే ఖర్చు చేశారు.. సినిమా విడుదల అవ్వడానికి టైమ్ పడుతుంది కనుక ఆ బడ్జెట్ యొక్క వడ్డీ పెరిగి పోతూనే ఉంటుంది. కోట్ల రూపాయలకు వడ్డీ నెలకు లక్షల్లోనే ఉంటుంది.

what is the loss and profit of RRR movie postpone
సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్సియర్స్ భారీ మొత్తంలో వడ్డీ తీసుకుంటారనే టాక్ ఉంది. కనుక వంద కోట్ల వరకు వడ్డీనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం ఏంటీ అంటే జక్కన్న సినిమా కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ మరియు హిందీ తమిళ ఇతర భాషల రైట్స్ తీసుకున్న వారు ఇప్పటికే నిర్మాత దానయ్యకు మూట కట్టబెట్టారు. కొందరు అడ్వాన్స్ గా చెల్లిస్తే మరి కొందరు పూర్తి మొత్తంను చెల్లించారు. కనుక దానయ్య కు ఆర్థికంగా వచ్చే నష్టం తక్కువే. కాని బయ్యర్లకే ఇప్పుడు భారీ నష్టాలు. వారు పది కోట్ల పెట్టి కొనుగోలు చేసిన సినిమా ఆలస్యం అవ్వడం వల్ల మరో కోటి అదనంగా వారికి వడ్డీ రూపంలో అవుతుంది. అదే కనుక నిజం అయితే వారికి లాభం వచ్చినా ఆ స్థాయిలో వస్తుందా అనేది అనుమానమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా లాభం విషయానికి వస్తే రాజమౌళి సినిమా ఎంత ఆలస్యం అయితే అంతగా బజ్ క్రియేట్ అవుతుంది.
సాదారణంగా వేరే దర్శకుల సినిమాలు ఆలస్యం అయితే బజ్ తగ్గుతుంది.. కాని రాజమౌళి సినిమాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఆలస్యం అయినా కొద్ది ఆర్ ఆర్ ఆర్ చర్చ పీక్స్ కు వెళ్తుంది. ఇక నష్టాల విషయానికి వస్తే హీరోలు ఇద్దరు కూడా నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం స్ట్రక్ అయ్యి ఉన్నారు. రాజమౌళి నుండి తదుపరి మహేష్ బాబు సినిమా వస్తుందని వెయిట్ చేస్తున్న వారు మరింత కాలం వెయిట్ చేయాలి. ఇక ఆర్ ఆర్ ఆర్ వస్తే థియేటర్లకు జల కల వస్తుందని ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పలేదు. ఇంకా ఆర్ ఆర్ ఆర్ ఆలస్యం వల్ల జరిగిన అతి పెద్ద నష్టం ఏంటీ అంటే జనాలు ఒక విజువల్ వండర్ ను ఎంజాయ్ చేయడం ఆలస్యం అవుతుంది.